తాండూరు కంది పప్పుకు భౌగోళిక గుర్తింపు!
విధాత: తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బంగినపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలకు భౌగోళిక గుర్తింపు వచ్చినట్లే తాజాగా తెలంగాణ లోని తాండూరు ప్రాంతంలో విస్తారంగా పండించే కందిపప్పుకు కూడా భౌగోళిక గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాండూరు కందిపప్పుతోపాటు అస్సాం గమోసా లద్దాఖ్ యాప్రికాట్ మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ వైట్ […]

విధాత: తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బంగినపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలకు భౌగోళిక గుర్తింపు వచ్చినట్లే తాజాగా తెలంగాణ లోని తాండూరు ప్రాంతంలో విస్తారంగా పండించే కందిపప్పుకు కూడా భౌగోళిక గుర్తింపు దక్కింది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
తాండూరు కందిపప్పుతోపాటు అస్సాం గమోసా లద్దాఖ్ యాప్రికాట్ మహారాష్ట్రకు చెందిన అలీబాగ్ వైట్ ఆనియన్లకు సైతం భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించింది. తాజాగా భౌగోళిక గుర్తింపు పొందిన వీటితో కలిపి దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరింది.
జీఐ ట్యాగ్ అత్యధికంగా సాధించిన రాష్ట్రాల్లో… కర్ణాటక అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో కర్ణాటక ఐదో స్థానంలో కేరళ నిలిచాయి. దేశంలో బాస్మతి రైస్, డార్జిలింగ్ టీ, చందేరి ఫ్యాబ్రిక్, మైసూర్ సిల్క్, కాంగ్రా టీ.. ఇలా చాలా వాటికి భౌగోళిక గుర్తింపు దక్కింది. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి నగిషీలకు సైతం గతంలో ఈ గుర్తింపు దక్కింది.
దేశంలో చాలా రాష్ట్రాల్లో కంది పండుతుంది కానీ తాండూరు కందిపప్పు తీరే వేరు. దాని రుచి, నాణ్యతకు దేశంలో మరేదీ సరిసాటి కాదు. ఇది త్వరగా ఉడకడమే కాకుండా త్వరగా పాడవకుండా ఉంటుందని చెబుతున్నారు. ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కోట్ల రూపాయల కందిపప్పు వ్యాపారం జరుగుతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు సైతం ఈ కందిపప్పు ఎగుమతి అవుతుంది. మొత్తానికి తాండూరు రైతుల కృషి, పట్టుదలతో నాణ్యమైన కందులు పండిస్తూ రాష్ట్రానికి కూడా పేరు తెచ్చారు.