Gold Rates | స్థిరంగా బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే..?
Gold Rates | దేశంలో సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 వద్ద కొనసాగుతుండగా.. 24 గ్రాముల పుత్తడి ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,930 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 వద్ద స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి […]

Gold Rates |
దేశంలో సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850 వద్ద కొనసాగుతుండగా.. 24 గ్రాముల పుత్తడి ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,930 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 వద్ద స్థిరంగా ఉన్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి రూ.56,330 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,440 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌ల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.55,850, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది.
ఇదిలా ఉండగా.. వెండి ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,400 పలుకుతున్నది. ప్లాటీనం ధరలు సైతం స్థిరంగానే ఉన్నాయి. పది గ్రాముల ప్లాటీనం ధర రూ.28,220గా ఉన్నది.