Gold Price | బంగారం ప్రియులకు ఊరట.. దిగివచ్చిన బంగారం ధర..! భారీగా పతనమైన వెండి..!!
Gold Price | బంగారం కొనుగోలుదారులకు ఊరటకలిగించే వార్త ఇది. మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. పది గ్రాముల 22 క్యారెట్ల పసిడిపై రూ.400 తగ్గి.. రూ.56,550 వద్ద ట్రేడవుతున్నది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గి రూ.61,690కి దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,840 పలుకుతున్నది. ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల […]

Gold Price | బంగారం కొనుగోలుదారులకు ఊరటకలిగించే వార్త ఇది. మొన్నటి వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. పది గ్రాముల 22 క్యారెట్ల పసిడిపై రూ.400 తగ్గి.. రూ.56,550 వద్ద ట్రేడవుతున్నది.
ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గి రూ.61,690కి దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,650 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,840 పలుకుతున్నది.
ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,690 ఉన్నది. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,240 పలుకుతున్నది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,550కి చేరగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,690 వద్ద ట్రేడవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర రూ.2,600 తగ్గి రూ.75వేల వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.రూ.78,700 పలుకుతున్నది.