Gold Rates: బంగారం.. మరింత పైపైకి..!
బులియన్ మార్కెట్లో పసిడి ధర గురువారం మరింత పెరిగింది. మరోవైపు పసిడితో పోటీగా వెండి ధర సైతం భారీగానే పెరిగింది.

Gold Rates: కొనుగోలుదారులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధర గురువారం మరింత పెరిగింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. రూ.450నుంచి 550కి పెరిగి.. తులానికి రూ. 81,200కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.490నుంచి 600కు పెరగడంతో తులం ధర రూ.88,580కి పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అదే ధర కొనసాగుతోంది.
మరోవైపు పసిడితో పోటీగా వెండి ధర సైతం భారీగానే పెరిగింది. వరుసగా రెండో రోజు వెండి ధరలు పెరిగాయి. నిన్న 2వేలు పెరుగగా, గురువారం రూ.1000పెరిగింది. బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1,01,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 1లక్ష 10వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగుళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా నమోదైంది.