Gold Rate | బంగారం కొనుగోలుదారులకు రిలీఫ్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం..!

Gold Rate | దేశంలో బంగారం ధరలు స్వల్పం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గి తులానికి రూ.54,900 పలుకుతున్నది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.110 తగ్గి రూ.59,890కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,040కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,890కి తగ్గింది. బెంగళూరులోనూ […]

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు రిలీఫ్‌.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం..!

Gold Rate |

దేశంలో బంగారం ధరలు స్వల్పం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గి తులానికి రూ.54,900 పలుకుతున్నది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.110 తగ్గి రూ.59,890కి చేరింది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,040కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,890కి తగ్గింది.

బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,330కి దిగివచ్చింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.59,890 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500 పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. దేశంలో ప్లాటినం ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం ప్లాటినంపై రూ.290 తగ్గి.. రూ.24,350 వద్ద ట్రేడవుతున్నది.