Gold Rate Hike | బంగారం ప్రియులకు షాక్‌.. పసడి ధర మళ్లీ పైపైకి..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

gold rate hike | బంగారం ప్రియులకు ఇది షాకింగ్‌ వార్తే. ఇటీవల స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్‌ ధరపై దాదాపు రూ.200 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.55,850కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగనున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోలో […]

Gold Rate Hike | బంగారం ప్రియులకు షాక్‌.. పసడి ధర మళ్లీ పైపైకి..! హైదరాబాద్‌లో ధరలు ఇలా..!

gold rate hike |

బంగారం ప్రియులకు ఇది షాకింగ్‌ వార్తే. ఇటీవల స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులం గోల్డ్‌ ధరపై దాదాపు రూ.200 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.55,850కి చేరింది.

24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930 వద్ద ట్రేడవుతున్నది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగనున్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలోలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి రేటు రూ.56వేలకు చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.61,080గా ఉన్నది. ముంబయి, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,850 వద్ద కొనసాగుతున్నది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,930కి చేరింది.

ఇక వెండిపై రూ.300 వరకు పెరిగి.. హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రూ.80,700 ధర పలుకుతున్నది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ రేటు స్థిరంగా కొనసాగుతున్నది. స్పాట్ గోల్డ్ ఔన్సు 1,999 డాలర్ల వద్ద కొనసాగుతోంది.