Gold Rates | మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర..! హైదరాబాద్‌లో తులం ఎంతంటే..?
Gold Rates | బంగారం ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. శనివారం కాస్త తగ్గినట్లు కనిపించినా.. ఆదివారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.61,950 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,850 వద్ద కొనసాగుతున్నది. […]

Gold Rates |
బంగారం ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. శనివారం కాస్త తగ్గినట్లు కనిపించినా.. ఆదివారం మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.61,950 వద్ద ట్రేడవుతున్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,850 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800 వద్ద ట్రేడవుతున్నది.
తెలుగు రాష్ట్రాలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర హైదరాబాద్‌లో కిలోకు రూ.78,500 కొనసాగుతున్నది. మరో వైపు అమెరికన్ డాలర్ బలపడడంతో.. ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ 2,015 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.