Gold Rates | నిలకడగా బంగారం ధర.. మళ్లీ రూ.80వేలు దాటిన వెండి.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు గత రెండురోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,450 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక కిలో వెండిపై రూ.500 పెరిగి.. ప్రస్తుతం రూ.76,900 పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో రూ22 క్యారెట్ల తులం బంగారం రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.రూ.59,600 […]

Gold Rates | నిలకడగా బంగారం ధర.. మళ్లీ రూ.80వేలు దాటిన వెండి.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates |

బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఇటీవల పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు గత రెండురోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.54,500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.59,450 వద్ద స్థిరంగా ఉన్నది.

ఇక కిలో వెండిపై రూ.500 పెరిగి.. ప్రస్తుతం రూ.76,900 పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

న్యూఢిల్లీలో రూ22 క్యారెట్ల తులం బంగారం రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.రూ.59,600 పలుకుతున్నది.

ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,450 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,780 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,450 వద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,450 వద్ద ట్రేడవుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా వెండి భారీగా పెరుగుతూ.. స్వల్పంగా తగ్గుతున్నది. తాజాగా సోమవారం మార్కెట్‌ ధర మరోసారి పెరిగింది. కిలోకు రూ.500 పెరిగి రూ.79,900 చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేలు పలుకుతున్నది.