Gold Rates | బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rates | దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.54,950 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.59,950 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,100 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,950 పలుకుతున్నది.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,220 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,950 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ.75,800 ఉండగా.. హైదరాబాద్‌లో కిలోకు రూ.79వేలు పలుకుతున్నది.