Gold-Silver Price | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌..! నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold-Silver Price | అగ్రరాజ్యం అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలున్నాయి. దానికి తోడు బెట్స్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసడికి డిమాండ్‌ ఉన్నది. ప్రస్తుతం గరిష్ఠ ధర పలుకుతున్నది. ఔన్స్‌కు రూ1966.20 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతున్నది. నిన్నా మొన్నటి వరకు పెరిగిన బంగారం ధర సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే ఢిలీల్లో 22 క్యారెట్ల […]

Gold-Silver Price | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌..! నేడు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

Gold-Silver Price |

అగ్రరాజ్యం అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచబోదన్న అంచనాలున్నాయి. దానికి తోడు బెట్స్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసడికి డిమాండ్‌ ఉన్నది. ప్రస్తుతం గరిష్ఠ ధర పలుకుతున్నది. ఔన్స్‌కు రూ1966.20 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఈ ప్రభావం భారత మార్కెట్లపై సైతం పడుతున్నది.

నిన్నా మొన్నటి వరకు పెరిగిన బంగారం ధర సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నది.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే ఢిలీల్లో 22 క్యారెట్ల బంగారం రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,370 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,490 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,220 వద్ద ట్రేడవుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,220 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల విషయానికి వస్తే..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.55,200 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రూ.60,220 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం స్థిరంగా కొనసాగుతున్నది. కిలోకు రూ.80వేలు పలుకుతున్నది.