ఎత్తులో క్వాలిఫై కానీ పోలీసు అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. మ‌రోసారి ఈవెంట్స్

విధాత‌: తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్స్ ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రిలిమిన‌రీ, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌ను పూర్తి చేసిన పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు.. మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో ఎత్తు విష‌యంలో క్వాలిఫై కాని అభ్య‌ర్థులు త‌మ‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో 1 సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే మ‌రోసారి […]

ఎత్తులో క్వాలిఫై కానీ పోలీసు అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. మ‌రోసారి ఈవెంట్స్

విధాత‌: తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్స్ ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్య‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రిలిమిన‌రీ, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌ను పూర్తి చేసిన పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు.. మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. అయితే ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో ఎత్తు విష‌యంలో క్వాలిఫై కాని అభ్య‌ర్థులు త‌మ‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో 1 సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోర్టు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేర‌కు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో 1 సెంటిమీట‌ర్, అంత కంటే త‌క్కువ ఎత్తులో క్వాలిఫై కాని అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి ఫిజిక‌ల్ ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎత్తు విష‌యంలో అర్హ‌త కోల్పోయిన అభ్య‌ర్థులు.. ఫిబ్ర‌వ‌రి 10, ఉద‌యం 8 గంట‌ల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌రకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ద‌ర‌ఖాస్తుతో పాటు అడ్మిట్‌కార్డును చూపించి, ఫిజిక‌ల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అంబ‌ర్‌పేట పోలీసు గ్రౌండ్స్‌, కొండాపూర్ 8వ బెటాలియ‌న్‌లో ఈవెంట్స్ నిర్వ‌హించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.