గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్..అమేర్ అలిఖాన్‌లు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండారమ్‌ను, సియాసత్ ఎడిటర్ అమెర్ అలీ ఖాన్ లను నామినేట్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయం

విధాత, హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండారమ్‌ను, సియాసత్ ఎడిటర్ అమెర్ అలీ ఖాన్ లను నామినేట్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేసింది. జీవో ఎంఎస్ నంబర్ 12 ద్వారా సాధారణ పరిపాలన శాఖ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యారంగం నుంచి కోదండరామ్‌ను, జర్నలిజం నుంచి అమెర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా గవర్నర్ తమిళి సై నామినేట్ చేశారు. అధికారిక గెజిట్ విడుదలవ్వడంతో శాసన మండలి సభ్యులుగా వారు ఆరేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా గెజిట్ విడుదలైన వెంటనే కోదండరామ్, అమెర్ అలీఖాన్‌లు సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి తమ నియమకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.