ప్రభుత్వం, వీఆర్ఎలు వేర్వేరు కాదు.. వారి సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని.. వీఆర్ఎల సమస్యలకు పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పే స్కేల్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించా లని కోరుతూ ఆందోళన చేస్తున్న వీఆర్ఎలతో నిన్న కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం, వీఆర్ఎలు వేర్వేరు కాదని.. వారు వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. ఇచ్చిన హామీల అమలు వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతుంది తప్పా వేరే ఉద్దేశం లేదని వారిని వివరించారు. ఆవేశానికి పోకూడదని వీఆర్ఎ […]

  • By: krs    latest    Sep 21, 2022 2:05 AM IST
ప్రభుత్వం, వీఆర్ఎలు వేర్వేరు కాదు.. వారి సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని.. వీఆర్ఎల సమస్యలకు పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పే స్కేల్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించా లని కోరుతూ ఆందోళన చేస్తున్న వీఆర్ఎలతో నిన్న కేటీఆర్ సమావేశమయ్యారు.

ప్రభుత్వం, వీఆర్ఎలు వేర్వేరు కాదని.. వారు వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. ఇచ్చిన హామీల అమలు వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతుంది తప్పా వేరే ఉద్దేశం లేదని వారిని వివరించారు. ఆవేశానికి పోకూడదని వీఆర్ఎ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.