నల్లగొండ: హరిత లక్ష్యాలు సాధించాలి: అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్లగొండ జిల్లా గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం కూడా గ్రీన్ లక్ష్యాలను సాధించాల్సిన అవసరముందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. అందుకుగాను రాబోయే రోజులలో మొక్కలు నాటడానికి వివిధ రకాల ప్లాంటేషన్ లైన లీనియర్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రిమిటోరియాలు, సేగ్రిగేషన్ షేడ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో స్థలాలు గుర్తించి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని […]

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: నల్లగొండ జిల్లా గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం కూడా గ్రీన్ లక్ష్యాలను సాధించాల్సిన అవసరముందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. అందుకుగాను రాబోయే రోజులలో మొక్కలు నాటడానికి వివిధ రకాల ప్లాంటేషన్ లైన లీనియర్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రిమిటోరియాలు, సేగ్రిగేషన్ షేడ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో స్థలాలు గుర్తించి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం నుండి మండల పరిషత్తు అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలంగాణకు హరితహారం, నర్సరీల పురోగతి, స్వచ్చ భారత్ మిషన్ లో రెట్రోఫిట్టింగ్ టు ట్విన్ పిట్ టాయిలెట్స్ పురోగతి, యస్.యస్.జి.-2023 పురోగతి, ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్లో పురోగతి, క్రిమిటోరియా, సేగ్రిగేషన్ షేడ్స్ ను ఉపయోగించుటపై సమీక్ష నిర్వహించారు.
అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణంలో పురోగతి, బృహత్ పల్లె ప్రకృతి వనాల పురోగతి, ట్రాక్టర్ లోన్ పేమెంట్, సి.సి.చార్జెస్ పేమెంట్, యం.జి.యన్.ఆర్.ఇ.జి.యస్. గుడ్ గవర్నెన్స్ పారామీటర్లలో పురోగతి మరియు 2023-24 లేబర్ బడ్జెట్ రూపకల్పన పనుల పురోగతిపై కూడా సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నర్సరీల పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉందని, రాబోయే 2 రోజులలో పురోగతిలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లాలోని ప్రతి మండలంలో అన్ని నర్సరీలకు అవసరమైన పాలిథిన్ సంచులను ఈ నెల 19 లోగా 100% ప్రొక్యూర్ చేసుకోవాలని, 50% బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రతి శుక్రవారం వాటరింగ్ డే గా పాటించాలని, ఆ రోజు అన్ని రకాల ప్లాంటేషన్ల మొక్కలకు నీరు పోసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మండల స్థాయి సిబ్బందిని ప్రతి గ్రామానికి ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ఒక గుంత టాయిలెట్స్ ఉన్న చోట స్థలం ఉంటే రెండు గుంతల టాయిలెట్స్ గా నిర్మించాలని, స్థలం లేకపోతే దానిని సెప్టిక్ ట్యాంక్ గా మార్చి ఇంకుడుగుంతను నిర్మించాలని అన్నారు
యస్.యస్.జి.-2023 కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఈ నెల 23 వ తేది లోపు 50% ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని క్రిమిటోరియాలు, సేగ్రిగేషన్ షెడ్స్ లను వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించాలని, గుర్తించిన వాటిలో నిర్మాణానికి అంచనాలు పూర్తిచేసి వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు.
జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలకు భూములను గుర్తించాలని కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ట్రాక్టర్ లోన్ పేమెంట్, సి.సి.చార్జెస్ పేమెంట్ చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
యం.జి.యన్.ఆర్.ఇ.జి.యస్. గుడ్ గవర్నెన్స్ పారామీటర్లలో వర్క్ సైట్ బోర్డులు నిర్మించుట, వర్క్ ఫైల్ తయారుచేయుట, జాబ్ కార్డులు అప్ డేట్ చేయుట, జి.పి.రికార్డులు అప్ డేట్ చేయడం 100% పూర్తి చేయాలని అన్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించడానికి అవసరమైన పనిదినాలతో లేబర్ బడ్జెట్ రూపకల్పన రూపొందించాలని కోరారు.
ఈ నెల 31 లోగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించి 2022-23 ఆర్థిక సంవత్సరం లేబర్ బడ్జెట్ లో పురోగతి సాధించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికా రిని కాళిందిని, జిల్లా పంచాయతి అధికారి విష్ణు వర్ధన్, సహాయక పథక సంచాలకులు, డివిజినల్ లెవెల్ పంచాయత్ అధికారులు పాల్గొన్నారు