రాజకీయాల్లో హుందాతనం ఉండాలి: మండలి చైర్మన్ గుత్తా

రాజకీయాల్లో హుందాతనం ఉండాలి: మండలి చైర్మన్ గుత్తా

– కేసీఆర్ పై రేవంత్ భాష సరికాదు

విధాత: రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలని, విచక్షణ లేకుండా అమర్యాదగా మాట్లాడటం సరికాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నామన్నారు. బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీలను ఇస్తోందని విమర్శించారు. వీటిని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు.


కర్ణాటక కాంగ్రెస్ నేతలు తెలంగాణకి వచ్చి హామీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ఎక్కువ అవినీతి చేసే రాష్ట్రం కర్ణాటక అని, అక్కడ పారిశ్రామిక వేత్తలు, బిల్డర్స్ కమీషన్ ఇవ్వలేక బాధపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఆరు గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ బీఆరెస్ పార్టీ ఓట్లు అడుగుతుంటే, ఒక్క కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో 12 సీట్లు బీఆర్ యస్ పార్టీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్నిసార్లు ఓడిపోయినా బుద్దిరాలేదన్నారు. ఆయన స్థాయిని మరిచి గజ్వేల్ లో పోటీ చేస్తా, నల్గొండలో ఒక్క బీఆర్ యస్ ఎమ్మెల్యేను అసెంబ్లీలో అడుగుపెట్టనియం అని మాట్లాడుతున్నాడు. నల్గొండలో బీఆరెస్ పార్టీ గెలిచే మొదటి స్థానం మునుగోడునే… రాజగోపాల్ రెడ్డి ఆయన పరిస్థితి ఏందో చూసుకొంటే మంచిదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, బీఆర్ యస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.