Rains: ఈనెల 8 వరకు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ

విధాత: రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తూ వడగళ్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. ఈ నెల 8వ తేదీ వరకు ఈదురు గాలులు వీస్తూ పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక పరిసర ప్రాంతాల నుంచి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల […]

  • By: krs    latest    Apr 06, 2023 5:23 PM IST
Rains: ఈనెల 8 వరకు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్‌ జారీ

విధాత: రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తూ వడగళ్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. ఈ నెల 8వ తేదీ వరకు ఈదురు గాలులు వీస్తూ పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక పరిసర ప్రాంతాల నుంచి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తం కారణంగా ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ మేరకు ఆదిలాబాద్‌, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఈ జిల్లాల్లో పలు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదుగు గాలులు వీస్తూ., అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.