భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
విధాత: భారీ వర్షంతో హైదరాబాద్ నగరం వణికిపోయింది. నగరంలో ఒక్కసారిగా వరుణుడు విరుచుకు పడ్డాడు. వరదనీరు చేరి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచి జనజీవనం స్తంభించి పోయింది. మూడు గంటల పాటు వరుణుడు ప్రతాపం చూపించాడు. వివిధ జిల్లాల్లో పిడుగు పాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. నేడు, రేపు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పదేళ్లలో సెప్టెంబర్‌లో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా వర్షపాతం కురిసింది. నందనం వద్ద 16.70 సెం.మీ., మెహదీపట్నంలో […]

విధాత: భారీ వర్షంతో హైదరాబాద్ నగరం వణికిపోయింది. నగరంలో ఒక్కసారిగా వరుణుడు విరుచుకు పడ్డాడు. వరదనీరు చేరి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచి జనజీవనం స్తంభించి పోయింది.
మూడు గంటల పాటు వరుణుడు ప్రతాపం చూపించాడు. వివిధ జిల్లాల్లో పిడుగు పాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. నేడు, రేపు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పదేళ్లలో సెప్టెంబర్‌లో ఎన్నడూలేని విధంగా అత్యధికంగా వర్షపాతం కురిసింది.

నందనం వద్ద 16.70 సెం.మీ., మెహదీపట్నంలో 11.25 సెం.మీ., నాంపల్లిలో 10.33 సెం.మీ., ఖైరతాబాద్ 10.23 సెం.మీ., ఎల్బీ స్టేడియం వద్ద 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 6, 2017న 9 సెం.మీ. వర్షపాతం రికార్డు. సోమవారం 3 గంటల వ్యవధిలోనే 12.7 సెం.మీ. వాన పడింది.