ప్రాణం కాపాడిన హెల్మెట్: అప్పుడే యాక్సిడెంట్.. ఆపై మీద పడ్డ స్తంభం(వీడియో)
విధాత: దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు ఓ వీడియోను తమ ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హెల్మెట్ ధరించిన వారికి ఆ దేవుడే సహాయం చేస్తాడంటూ.. ఆ వీడియోకు ఢిల్లీ పోలీసులు క్యాప్షన్ ఇచ్చారు. అసలు ఆ వీడియో ఏంటంటే.. ఓ ద్విచక్ర వాహనదారుడు.. వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారును తప్పించబోయి.. అక్కడున్న ఓ వీధి స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ పై నుంచి సదరు […]

విధాత: దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు ఓ వీడియోను తమ ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హెల్మెట్ ధరించిన వారికి ఆ దేవుడే సహాయం చేస్తాడంటూ.. ఆ వీడియోకు ఢిల్లీ పోలీసులు క్యాప్షన్ ఇచ్చారు.
అసలు ఆ వీడియో ఏంటంటే.. ఓ ద్విచక్ర వాహనదారుడు.. వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారును తప్పించబోయి.. అక్కడున్న ఓ వీధి స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్ పై నుంచి సదరు వాహనదారుడు కింద పడిపోయాడు.
హెల్మెట్ ఉండటంతో తాను తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. ఇక ఆ ప్రమాదం నుంచి తేరుకుని, లేస్తుండగానే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వీధి స్తంభం కూడా కింద పడిపోయింది. అది కూడా సరిగ్గా ఆ వాహనదారుడి తలపైనే పడిపోయింది.
మళ్లీ కుప్పకూలాడు. అయినప్పటికీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కేవలం హెల్మెట్ ధరించడం వల్లే ఆ వాహనదారులు తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. 17 గంటల క్రితం ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేయగా, 26 వేల మంది లైక్ చేశారు. 5 వేల మంది రీ ట్వీట్ చేశారు.