హీరోయిన్ రాధ రీఎంట్రీ.. కానీ!

విధాత: హీరోయిన్ రాధ గురించి నేటి తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ 1980 నుంచి 1990 వరకు అంటే దశాబ్దం పాటు ఈమె తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన పలు చిత్రాలలో హీరోయిన్ వేషాలు వేసింది. నాడు విజయశాంతి, రాధ మ‌ధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండేది. అయినా ఇద్దరు కలిసి ప‌లు చిత్రాల‌లో నటించిన సందర్భాలు కోకొల్ల‌లుగా ఉన్నాయి. డాన్సింగ్‌లో రాధిక తర్వాత చిరంజీవి పక్కన రాధ చేస్తుంటే ఆ గ్రేసే వేరు. […]

  • By: krs    latest    Dec 21, 2022 11:18 AM IST
హీరోయిన్ రాధ రీఎంట్రీ.. కానీ!

విధాత: హీరోయిన్ రాధ గురించి నేటి తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ 1980 నుంచి 1990 వరకు అంటే దశాబ్దం పాటు ఈమె తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన పలు చిత్రాలలో హీరోయిన్ వేషాలు వేసింది. నాడు విజయశాంతి, రాధ మ‌ధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండేది. అయినా ఇద్దరు కలిసి ప‌లు చిత్రాల‌లో నటించిన సందర్భాలు కోకొల్ల‌లుగా ఉన్నాయి. డాన్సింగ్‌లో రాధిక తర్వాత చిరంజీవి పక్కన రాధ చేస్తుంటే ఆ గ్రేసే వేరు. రాధ కేవలం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తోనే కాదు ఆ ముందు తరమైన ఎన్టీఆర్, ఏఎన్నార్లతో కూడా కలిసి నటించింది.

ఏఎన్ఆర్‌తో గోపాలకృష్ణుడు, ఎన్టీఆర్‌తో చండశాసనుడు, కృష్ణతో సింహాసనం, చిరంజీవితో దొంగ, ఆయన వందో చిత్రం లంకేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆమె తెలుగులోనే కాదు తమిళం లో రజనీకాంత్, కమలహాసన్‌తో పాటు శివాజీ గణేషన్ స‌ర‌స‌న కూడా నటించింది. రాధ వెండితెర వైభవం ముగిసి దాదాపు మూడు దశాబ్దాలు దాటిపోయింది. రాధ అంటే డాన్స్ ఐకాన్. రాధ డాన్స్ స్కిల్స్ అద్భుతం. ఆమె గ్రేస్ అదిరిపోయేది.

ఆ రోజుల్లో చిరంజీవి, రాధ సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడి డాన్స్ చేస్తూ స్టెప్పులు వేశారు. ఒక దశాబ్దం పాటు రాధ తిరుగులేని హీరోయిన్‌గా పరిశ్రమను ఏలింది. చాలాకాలంగా రాధ కనిపించడం లేదు. కానీ తన 57వ ఏట బిగ్ బాస్ వేదికపై ఆమె కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌లో ఒకరిగా రాధ హాజరయ్యారు. ఆమె ఎనర్జీ, కాన్ఫిడెన్స్ చూస్తుంటే మతి పోతోంది. కొంచెం లావు అయిందే గాని వృద్ధాప్యపు ఛాయలు అసలు లేవు. అన్నిటిని మించిన యంగ్ ఫీలింగ్స్.. యాటిట్యూడ్ అద్భుతంగా ఉన్నాయి.. ఆడియ‌న్స్ ఆమె హావ‌భావాలు, మాట్లాడే మాట‌లు వింటూ అలా చూస్తూ ఉండిపోయారంటే నిజం.

ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే త్వరలో ప్రారంభం కానున్న ‘బీబీ జోడీ’ షోకి జడ్జిగా ఆమె వస్తున్నారు. కాగా రాధాకు ఇద్దరు కూతుర్లు. ఒకరు కార్తీక, మరొకరు తులసి. ఇద్దరూ హీరోయిన్లుగా పరిచయం అయ్యారు, కార్తిక మొదటి చిత్రం జోష్ ఈ చిత్రం ద్వారానే అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయమయ్యాడు, ఆ తరువాత తమిళంలో జీవ హీరోగా నటించిన రంగం మూవీతో కార్తీక మంచి విజయం సాధించింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగులో కూడా ఘనవిజయం సాధించింది.