జగన్ అక్రమాస్తుల కేసు: ‘హెటిరో’కు సుప్రీంలో చుక్కెదురు
విధాత: జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెటిరోపై సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయడానికి ట్రయల్ కోర్టు, హైకోర్టులు గతంలోనే నిరాకరించాయి. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హెటిరో కంపెనీ తమపై దాఖలైన కేసును కోట్టి వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హెటిరో తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోతగి వాదనలు వినిపించగా న్యాయమూర్తులు కె ఎం జోసెఫ్, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. హెటిరో పై దాఖలైన కేసు కొట్టివేయతగినది […]

విధాత: జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెటిరోపై సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయడానికి ట్రయల్ కోర్టు, హైకోర్టులు గతంలోనే నిరాకరించాయి. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హెటిరో కంపెనీ తమపై దాఖలైన కేసును కోట్టి వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హెటిరో తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోతగి వాదనలు వినిపించగా న్యాయమూర్తులు కె ఎం జోసెఫ్, హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
హెటిరో పై దాఖలైన కేసు కొట్టివేయతగినది కాదని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ అన్నారు. ఏ1గా ఉన్న ఏపీ సీఎం జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వెంటనే హెటిరో కంపెనీకి 80 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. జగన్ కంపెనీ ప్రారంభించకుండానే కంపెనీలో రూ.350 ప్రీమియంతో షేర్లు కొనుగోలు చేసి హెటిరో పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు అని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
సీబీఐ పక్కాగానే చార్జిషీటు దాఖలు చేసిందని సుప్రీం ధర్మాసనం తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోపై దాఖలైన కేసును కొట్టివేయడానికి నిరాకరించింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
హెటిరో కంపెనీ మొత్తాన్ని ఎఫ్ఐఆర్‌లో చేర్చడం న్యాయ విరుద్దమన్న న్యాయవాది ముకుల్ రోతగి. హెటిరో కంపెనీలో పనిచేసే వ్యక్తులపై కేసు పెట్టవచ్చు కానీ కంపెనీపై కాదని హెటిరో న్యాయవాది వాదించారు. రోతగి వాదనలను సుప్రీం ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు కదా.. హెటిరో పిటిషన్ ను డిస్మిస్ చేసింది.