High Court: పోడు భూముల క్రమబద్దీకరణలో నిబందనలు పాటించాలి.. హైకోర్టు ఆదేశం

పట్టాల పంపిణీపై స్టే నిరాకరణ.. జూన్‌22కు కేసు వాయిదా విధాత: పోడు భూముల క్రమబద్దీకరణలో చట్టాన్ని, నిబంధనలను పాటించాలని రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది(High Court order). పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలంటూ ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పద్మనాభరెడ్డి(Padmanabha Reddy) వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటీషనర్‌ పోడుభూములకు పట్టాలివ్వడం చట్టవిరుద్దమని హైకోర్టులో వాదించారు. అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా ప్రభుత్వం […]

High Court: పోడు భూముల క్రమబద్దీకరణలో నిబందనలు పాటించాలి.. హైకోర్టు ఆదేశం
  • పట్టాల పంపిణీపై స్టే నిరాకరణ.. జూన్‌22కు కేసు వాయిదా

విధాత: పోడు భూముల క్రమబద్దీకరణలో చట్టాన్ని, నిబంధనలను పాటించాలని రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది(High Court order). పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలంటూ ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పద్మనాభరెడ్డి(Padmanabha Reddy) వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటీషనర్‌ పోడుభూములకు పట్టాలివ్వడం చట్టవిరుద్దమని హైకోర్టులో వాదించారు.

అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా ప్రభుత్వం ఇచ్చిన మెమో ఉందని పిటీషనర్‌ వాదించారు. అయితే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటే న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యాడు. కేసు వాదనలు విన్న హైకోర్టు పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్‌22వ తేదీకి వాయిదా వేసింది.