Kunamneni | హిట్లర్ వారసుడు.. నరేంద్ర మోడీ: కూనంనేని

లొంగిపోతే లిక్కర్ స్కాం ఉండేది కాదు బీజేపీని అడ్డుకోవడం మా లక్ష్యం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వాలను పడగొట్టడం లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఢిల్లీ తెలంగాణ రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులపై కేంద్ర ప్రభుత్వం కేసులు బనాయిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లొంగిపోయి ఉంటే లిక్కర్ స్కాం ఉండేది కాదన్నారు. హనుమకొండలో […]

Kunamneni | హిట్లర్ వారసుడు.. నరేంద్ర మోడీ: కూనంనేని
  • లొంగిపోతే లిక్కర్ స్కాం ఉండేది కాదు
  • బీజేపీని అడ్డుకోవడం మా లక్ష్యం
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వాలను పడగొట్టడం లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఢిల్లీ తెలంగాణ రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులపై కేంద్ర ప్రభుత్వం కేసులు బనాయిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

ఢిల్లీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లొంగిపోయి ఉంటే లిక్కర్ స్కాం ఉండేది కాదన్నారు. హనుమకొండలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాలలో బీజేపీ తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిందని విమర్శించారు. దేశంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారంతా పునీతులు కావడం కోసం బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు.

బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ

బీజేపీ అత్యంత ప్రమాదకరమైన మతతత్వ కరెప్టేడ్డ్ పార్టీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని చేసే పనులు చూస్తే హిట్లర్ వారసుడుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని సింగల్ డిజిట్‌కు పరిమితం చేయడమే ఉభయ కమ్యూనిస్టు పార్టీల లక్ష్యంగా పని చేస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు. మతతత్వ పార్టీని ఓడించడం కోసం ప్రజాస్వామ్య లౌకిక వాదులంతా ఒకటి కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజలు చైతన్య పరచడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు.

కొద్ది మంది చేతుల్లో సంపద

భారతదేశంలో సంపద అంతా కొద్ది మంది చేతులు పోగుబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అన్నారు. ఆకలి అసమానత సూచికలో ప్రపంచంలో భారతదేశం 107 స్థానంలోకి పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఆదానీ, లలిత మోడీ, నిరోమోడి లాంటి వాళ్లపై బీజేపీ ప్రభుత్వం ఒక కేసు ఇప్పటివరకు పెట్టలేదని విమర్శించారు.

దేశంలో తొమ్మిది సంవత్సరాల పాలనలో బీజేపీ 150 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందనీ, కానీ ఒక కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేశారు. దేశంలో మహిళా వేధింపుల కేసులు నమోదైన ఎక్కువ ప్రజా ప్రతినిధులు బీజేపీలోనే ఉన్నారని విమర్శించారు. బీజేపీలో 58 ఎమ్మెల్యేలు, 70 మంది ఎంపీలు ఉన్నారని సాంబశివరావు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి బిక్షపతి మేకల రవి విజయ సారధి రాజారెడ్డి వలివుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.