జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి స‌న్మానం

విధాత, మెదక్ బ్యూరో: రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి… మెదక్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచింది. క్రీడాకారులను సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు. 8 th తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ మెన్ & ఉమెన్స్ అండర్ 20,18,16 బాల బాలికలకు మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా ఉమెన్ విభాగంలో ఎస్.నందిని, అండర్ […]

జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి స‌న్మానం

విధాత, మెదక్ బ్యూరో: రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి… మెదక్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ గా నిలిచింది. క్రీడాకారులను సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు.

8 th తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ మెన్ & ఉమెన్స్ అండర్ 20,18,16 బాల బాలికలకు మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా ఉమెన్ విభాగంలో ఎస్.నందిని, అండర్ -20 విభాగంలో వి.సవిత, సిహెచ్. బబిత ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికైనారు.

వీరు జనవరి 8.01.2023 అస్సాం రాష్ట్రంలో జరిగే జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో మెదక్ మండల రైతు బంధు అధ్యక్షులు కిష్టయ్య, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ పురం వెంకట్ నారాయణ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఉమర్ మొహిద్దీన్, మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, బిఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, అరవింద్ గౌడ్, శివరామకృష్ణ జుబేర్, జగదీశ్, సాంసన్ సందీప్, మెదక్ డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. మధుసూదన్, జాయింట్ సెక్రెటరీ ఈ. రాజేందర్, కోశాధికారి ఏ. సుజాత, మెదక్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహిపాల్, మెదక్ డిస్టిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి జుబే,ర్ స్వప్న, PD వినోద్ చంటి క్రీడాకారులు పాల్గొన్నారు.