నేటి నుంచి.. హైదరాబాద్‌ నేషనల్ బుక్ ఫెయిర్

2023 జనవరి1 వరకు..  మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విధాత: పుస్తకాల పండుగ గురువారం నుంచి 2023 జనవరి1 వరకు కొనసాగుతుంది. పుస్తక ప్రియులకు అత్యంత ఇష్టమైన ఈ పండుగ తెలంగాణ కళాభారతి స్టేడియంలో11 రోజుల పాటు కొనసాగనున్నది. 35 వ హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో 300 స్టాల్స్‌ ఏర్పాటు అవుతున్నాయి. లక్షలాది పుస్తకాలను ఈ […]

నేటి నుంచి.. హైదరాబాద్‌ నేషనల్ బుక్ ఫెయిర్
  • 2023 జనవరి1 వరకు..
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు
  • సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు

విధాత: పుస్తకాల పండుగ గురువారం నుంచి 2023 జనవరి1 వరకు కొనసాగుతుంది. పుస్తక ప్రియులకు అత్యంత ఇష్టమైన ఈ పండుగ తెలంగాణ కళాభారతి స్టేడియంలో11 రోజుల పాటు కొనసాగనున్నది. 35 వ హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో 300 స్టాల్స్‌ ఏర్పాటు అవుతున్నాయి. లక్షలాది పుస్తకాలను ఈ ఫెయిర్‌లో ప్రదర్శించనున్నారు.

ఈ బుక్‌ ఫెయిర్‌కు తెలంగాణ, ఏపీల నుంచే కాకుండా ఢిల్లీ, కోల్‌కత్తా, మహారాష్ట్ర, కర్నాటకలతో పాటు పలు ప్రాంతాల నుంచి వివిధ పబ్లిషర్లు వచ్చి తమ పుస్తకాలను ప్రదర్శించనున్నారు. దేశంలో కోల్‌కత్తా తర్వాత అతిపెద్ద రెండో పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ రికార్డుకెక్కింది. ఈ బుక్‌ ఫెయిర్‌లో 10 లక్షల మంది పుస్తక ప్రియులు పాల్గొనే అవకాశం ఉంది.

బుక్‌ ఫెయిర్‌ నిర్వహణకు ఉచితంగా స్టేడియం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జ్ఞాన తెలంగాణ లక్ష్యంగా బుక్‌ ఫెయిర్‌ నిర్వహణకు స్టేడియంను పూర్తి ఉచితంగా అందించారని నిర్వాహకులు తెలిపారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూ ఇతర భారతీయ భాషల సాహిత్యంతో పాటుగా, బాలల సాహిత్యం అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు సైన్సు& టెక్నాలజీ, కథల. ఫీలాసఫీ, చరిత్ర, భౌగోళిక పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు.

బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి మిద్దెరాములు పేరు ఖరారు

జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి తెలంగాణ ఒగ్గు కళారూపానికి వన్నె తెచ్చిన ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టామని, వేదికకు కవి అలిశేట్టి ప్రభాకర్ పేరు పెట్టామని బుక్‌ ఫెయిర్‌ నిర్వాహకులు తెలిపారు. గురువారం నుంచి కొనసాగే ఈ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు కొనసాగుతుందని, శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుందన్నారు.

పరిచయం కానున్న కొత్త రచయితల పుస్తకాలు

ఈ బుక్ ఫెయిర్‌లో కొత్త రచయితల పుస్తకాలు పరిచయం కానున్నాయి. రెండేళ్ల కరోనా కాలంలో అనేక మంది పుస్తకాలు చదవడమే కాక, రచనలు చేసిన నేపథ్యంలో కొత్త పుస్తకాలు విడుదల కానున్నట్లు బుక్ ఫెయిర్ నిర్వహకులు తెలిపారు.

మ‌న ముఖ్యమంత్రి స్టాల్ పేరుతో స్టాల్ ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై అనేక పుస్తకాలు ఈ స్టాల్ లో దొరుకుతాయని బుక్ ఫెయిర్ సోసైటీ అధక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్ వెల్లడించారు.

పోటీ పరీక్షలకు సిద్ధ‌మయ్యే అభ్యర్థులకు ఈ స్టాల్ ఉపయోగపడుతుందన్నారు. అలాగే కేంద్ర హిందీ సంస్థాన్ ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ స్టాల్‌లో హిందీ రచయితల పుస్తకాలు, గ్రంథాలు లభిస్తాయన్నారు. యువ రచయితలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశామని, ఇందులో రచయితలు నేరుగా తాము రచించిన పుస్తకాలను, పుస్తక ప్రదర్శనకు వచ్చే పాఠకులతో చర్చలు జరుపవచ్చని తెలిపారు.

బుక్‌ డొనేషన్‌ బాక్స్‌ ఏర్పాటు

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రంథాలయలకు పుస్తకాలు చేర్చేందుకు, ఈ పుస్తక ప్రదర్శనలో బుక్ డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశామన్నారు. రచయితలు, పుస్తక ప్రియులు తాము చదివిన పుస్తకాలనే కాక, ఇతర పుస్తకాలను లైబ్రరీలకు అందించడం ద్వారా గ్రంథాలయాల అభివృద్దికి ఉపయోగపడతారన్నారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలకు పుస్తకాలను అందజేయాలని కోరారు.