హైదరాబాదీ మహిళపై.. జహీరాబాద్‌లో గ్యాంగ్ రేప్
విధాత: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన ఓ వివాహిత(26) తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత కొంత కాలం నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. అయితే శుక్రవారం రాత్రి ఆమెకు తెలిసిన వ్యక్తులు, కూకట్‌పల్లి నుంచి బలవంతంగా జహీరాబాద్ వైపు […]

విధాత: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన ఓ వివాహిత(26) తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత కొంత కాలం నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. అయితే శుక్రవారం రాత్రి ఆమెకు తెలిసిన వ్యక్తులు, కూకట్‌పల్లి నుంచి బలవంతంగా జహీరాబాద్ వైపు తీసుకెళ్లారు.
ఆ తర్వాత వివాహితకు మత్తు పదార్థాలు ఇచ్చారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఇక బాధితురాలిని అక్కడే వదిలేసి, వారు తిరిగొచ్చారు. శనివారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి జహీరాబాద్ పోలీసులు చేరుకుని, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తన పట్ల సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.