IAS Tina Dabi | మ‌రోసారి వార్త‌ల్లోకి ఐఏఎస్ టీనా దాబీ.. ప్రెగ్నెంట్ అయినందుకేనా..?

IAS Tina Dabi విధాత‌: ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. 2015 సివిల్స్ ఫ‌లితాల్లో ప్ర‌థ‌మ ర్యాంక‌ర్‌గా నిలిచి, యువ‌త గుండెల్లో నిలిచినా టీనా.. సెకండ్ ర్యాంక‌ర్ అమీర్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుని.. దేశ వ్యాప్తంగా పాపుల‌రిటీ సంపాదించారు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. అమీర్ ఖాన్ నుంచి టీనా దూర‌మైంది. విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత సీనియ‌ర్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను రెండో పెళ్లి చేసుకున్న‌ది. అయితే ప్ర‌దీప్ గ‌వాండే […]

  • By: Somu    latest    Jul 19, 2023 10:26 AM IST
IAS Tina Dabi | మ‌రోసారి వార్త‌ల్లోకి ఐఏఎస్ టీనా దాబీ.. ప్రెగ్నెంట్ అయినందుకేనా..?

IAS Tina Dabi

విధాత‌: ఐఏఎస్ ఆఫీస‌ర్ టీనా దాబీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. 2015 సివిల్స్ ఫ‌లితాల్లో ప్ర‌థ‌మ ర్యాంక‌ర్‌గా నిలిచి, యువ‌త గుండెల్లో నిలిచినా టీనా.. సెకండ్ ర్యాంక‌ర్ అమీర్ ఖాన్‌ను ప్రేమ వివాహం చేసుకుని.. దేశ వ్యాప్తంగా పాపుల‌రిటీ సంపాదించారు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. అమీర్ ఖాన్ నుంచి టీనా దూర‌మైంది. విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత సీనియ‌ర్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను రెండో పెళ్లి చేసుకున్న‌ది. అయితే ప్ర‌దీప్ గ‌వాండే తండ్రి కాబోతున్న‌ట్లు స‌మాచారం. టీనా దాబీ ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అని వార్త‌లు వ‌స్తున్నాయి.

View this post on Instagram

A post shared by Ria Dabi (@ria.dabi)

ఎందుకంటే.. జైస‌ల్మేర్‌లో క‌లెక్ట‌ర్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న టీనా.. ఇటీవ‌ల సెల‌వు మీద వెళ్లారు. జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో స‌హ‌క‌రించిన ఉద్యోగుల‌కు, స్థానికులకు టీనా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టీనా కొన్ని ఫోటోలు కూడా పోస్టు చేశారు. త‌న ఆధ్వ‌ర్యంలో జైస‌ల్మేర్‌లో చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఆమె వివ‌రించారు.

అయితే జైస‌ల్మేర్ నుంచి టీనా ఎందుకు వెళ్లిపోయింద‌న్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీస‌ర్ ప్ర‌దీప్ గ‌వాండేను పెళ్లి చేసుకున్న టీనా త్వ‌ర‌లో త‌ల్లికాబోతున్న‌ట్లు మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఆమె మెట‌ర్నిటీ లీవ్ తీసుకున్న‌ట్లు ప‌లు క‌థ‌నాలు స్ప‌ష్టం చేశాయి. ఇటీవ‌ల త‌న సోద‌రి రియా దాబి పుట్టిన రోజు వేడుక‌ల్లో టీనా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో దిగిన ఫోటోలో టీనా బేబీ బంప్ క‌నిపించిన‌ట్లు ప‌లు మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి.