ఇంటి పన్ను కట్టకుంటే.. కరెంట్ కట్

విధాత, మెదక్ బ్యూరో: ఇంటి పన్ను కట్టకపోతే కరెంట్ కట్ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో వసూల్ కావాలంటే పన్ను చెల్లించని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించాలని నిర్ణయించారు.ఇంకేముంది.. దీనిని […]

  • By: Somu    latest    Feb 09, 2023 11:12 AM IST
ఇంటి పన్ను కట్టకుంటే.. కరెంట్ కట్

విధాత, మెదక్ బ్యూరో: ఇంటి పన్ను కట్టకపోతే కరెంట్ కట్ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో వసూల్ కావాలంటే పన్ను చెల్లించని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించాలని నిర్ణయించారు.ఇంకేముంది.. దీనిని అమలు చేస్తున్నారు.

ఈ తీర్మానం నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ పేద ప్రజలు ఒకేసారి ఇంటి పన్ను కట్టడం కష్టంగా మారింది. గ్రామ పంచాయతీ ఈఓతో పాటు సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేసుకోవాలి తప్ప ఇలాంటి నిబంధనలతో ప్రజలకు ఇబ్బందిగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ కాబట్టి నిధుల కొరత ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిబంధనలతో సామాన్య, మధ్య, తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.