ఐక్యంగా ఉంటేనే BRS, BJPలను ఎదుర్కోగలం: దిగ్విజయ్ సింగ్
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయి ఎంఐఎం కూడాబీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది బీఆర్‌ఎస్, బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కలిసి పోరాడండి అధికారం కాంగ్రెస్‌దే మీడియా సమావేశంలో ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విధాత: కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కోగలమని ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. నాయకులంతా ఐక్యంగా పార్టీ లైన్‌లో పని చేయాలని ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభానికి తెరదించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గురువారం […]

- బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయి
- ఎంఐఎం కూడాబీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది
- బీఆర్‌ఎస్, బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది
- కలిసి పోరాడండి అధికారం కాంగ్రెస్‌దే
- మీడియా సమావేశంలో ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్
విధాత: కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే బీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కోగలమని ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. నాయకులంతా ఐక్యంగా పార్టీ లైన్‌లో పని చేయాలని ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభానికి తెరదించడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గురువారం నేతలతో విడివిగా చర్చించారు. అందరి అభిప్రాయాలను స్వీకరించిన తరువాత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సంబంధాలున్నాయన్నారు. ఎంఐఎం కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని, కాంగ్రెస్ నేతలంతా కలిసి పని చేయడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నేతలున్నారని, వారంతా కలిసి పార్టీ లైన్‌లో పని చేయాలని హితబోధ చేశారు. నాయకులంతా ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. అందరూ కలిసి టీఆర్‌ఎస్‌పై పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
అంతర్గత సమస్యలుంటే నాతో మాట్లాడండి
అంతర్గత సమస్యలుంటే తనతో మాట్లాడాలని, బహిరంగంగా మాట్లాడకూడదని దిగ్విజయ్ సింగ్ నేతలకు హితవు పలికారు. పార్టీ సమస్యలపై ఏ పరిస్థితిలో మీడియాకు ఎక్కవద్దని హెచ్చరించారు. అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ బహిరంగ ఆరోపణలు వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
మరో సారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించారు. అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడి పైనైనా చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. రాష్ర్టంలో ప్రజలు టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయారని, ప్రజల పక్షాన నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు.
సమసలన్నీ సెటిల్ అవుతాయి
రాష్ట్ర పార్టీలో నెలకొన్న సమస్యలన్నీసెటిల్ అవుతాయని డిగ్గి రాజా అన్నారు. సీనియర్, జూనియర్ అనే సమస్యనే లేదన్నారు. పార్టీలో సీనియార్టీకి గౌరవం ఉంటుందన్నారు. అయితే పార్టీ ముందుకు వెళ్లడానికి ఒక్క సీనియార్టీనే కాదు… పీసీసీ తీరుతో పాటే ముందుకు వెళతామన్నారు.
రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ నాయకులుండగా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం 34 ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడయ్యాయని గుర్తు చేశారు. తాను కూడా 38 ఏండ్లకే పీసీసీ అధ్యక్షుడిని అయ్యానన్నారు. ఆనాడు ఉన్న సీనియర్ నేతుల, సీఎంలతో కలుపుకొని పని చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు.
మార్పు నా పరిధిలోని అంశం కాదు…
పీసీసీ అధ్యక్షుడి మార్పు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మార్పు అంశం తన పరిధిలోనిది కాదని దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేతలందరితో మాట్లాడాను.. వారు చెప్పిన అంశాలన్నింటిని ఏఐసీసీకి తెలియ జేస్తానన్నారు.
పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి మొన్ననే తనను కలిశాడని, అన్ని విషయాలు వివరించాడన్నారు. ఇక్కడ సీనియర్ నేతలందరితోనూ చర్చించానన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన మీడియాకు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు.