కేసీఆర్ వల్లే తెలంగాణలో మత్స్య సంపద పెరుగుదల: ఎమ్మెల్యే పద్మ
రాయిన్ పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల చేపలను వదిలిన ఎమ్మెల్యే విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో మత్స్య సంపద పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండలం రాయిన్ పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల చేప పిల్లలు ఎమ్మెల్యే మత్స్యశాఖ అధికారిని రజినితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర ప్రాంతానికి […]

- రాయిన్ పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల చేపలను వదిలిన ఎమ్మెల్యే
విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో మత్స్య సంపద పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండలం రాయిన్ పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల చేప పిల్లలు ఎమ్మెల్యే మత్స్యశాఖ అధికారిని రజినితో కలిసి వదిలారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేదని కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్య సంపదకు నిలయంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మత్తులు చేసుకొని సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు.
జిల్లాలో ఐదు కోట్ల చేప పిల్లలను ఉచితంగా చెరువులలో వదలడం జరిగిందని, అందులో మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కోటి 80 లక్షల చేప పిల్లలను వేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం రొయ్యలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.
మత్స్యకారులు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాబోవుకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని చెరువులు, చెక్ డ్యామ్ లో కూడా చేప పిల్లలు వదలడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సొసైటీలో గంగపుత్రులకు, ముదిరాజులకు సభ్యత్వం చేసుకునే అవకాశం ఇవ్వాలని మత్స్యశాఖ అధికారినికి సూచించారు
కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, సర్పంచులు, గంగ పుత్రులు తదితరులు పాల్గొన్నారు.