Ind vs Pak | ఇండియా-పాక్ మ్యాచ్‌కి ఇంత డిమాండా.. ఏకంగా ఆసుపత్రి బెడ్స్ బుక్ చేసుకుంటున్నారుగా..!
Ind vs Pak: దాయాది దేశాల మధ్య పోరు అంటే ప్రేక్షకులలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ జరిగినప్పుడల్లా టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఇక వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఈ రెండు జట్లు పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అక్టోబర్ 5 నుండి ఇండియా వేదికగా వరల్డ్ కప్ టోర్నీ మొదలు కానుంది. అయితే అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో భారత్ -పాక్ తలపనుండగా, వారి మ్యాచ్ చూడటానికి […]

Ind vs Pak: దాయాది దేశాల మధ్య పోరు అంటే ప్రేక్షకులలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ జరిగినప్పుడల్లా టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఇక వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఈ రెండు జట్లు పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
అక్టోబర్ 5 నుండి ఇండియా వేదికగా వరల్డ్ కప్ టోర్నీ మొదలు కానుంది. అయితే అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో భారత్ -పాక్ తలపనుండగా, వారి మ్యాచ్ చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇదే అదునుగా భావించిన హోటల్ యజమానులు ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారట. స్టార్ హోటల్స్ అయితే లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా హోటల్స్ బుకింగ్ కాగా, అభిమానులు కొత్త స్కెచ్ వేశారు.
ఎలా అయిన లైవ్‌లో మ్యాచ్‌లో చూడాలని భావించిన ఫ్యాన్స్ నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ కి కూడా భారీగా డిమాండ్ పెరిగిందట. కార్పొరేట్ ఆసుపత్రిలో.. ఫుల్ బాడీ చెకప్ అంటూ ఓవర్ నైట్ స్టే బుక్ చేసుకుంటున్నట్టు టాక్.
ఈ క్రమంలో కొందరు తక్కువ రేటుకే ఆసుపత్రి బెడ్లను పొందుతున్నారు. అయితే.. ఈ క్రికెట్ ఫ్యాన్స్ ఆసుపత్రిని ఇలా తెలివిగా వాడుకుంటున్నారని తెలిసి.. ఆస్పత్రి యాజమాన్యాలు కూడా విపరీతంగా రేట్లను పెంచుతున్నారట. ఇక తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న పలు హాస్పిటల్ యాజమాన్యాలు చెప్పుకొస్తున్నాయి.
సాధారణంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ లు అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇండియా వేదికగా ఆ మ్యాచ్‌లు అసలు జరగడం లేదు. ఆసియా కప్ లో అంతకుముందే రెండుసార్లు తలపడే అవకాశం ఉన్నా కూడా ఆ మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించారు. చాలా రోజుల తర్వాత అహ్మదాబాద్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరగనుండడంతో ఈ మ్యాచ్ కు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది.