Indian Railway | రైలు ప్రయాణం చేస్తుంటారా..? ఎమర్జెన్సీ ప్రయాణంలో ఖాళీ బెర్తుల సమాచారం ఇలా తెలుసుకోండి..!

Indian Railway | దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. నిత్యం వేలాది రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు తక్కువ చార్జీలు ఉండడంతో రైలు ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అయితే, చాలా మంది రిజర్వేషన్‌ చేసుకొని ప్రయాణిస్తుంటారు. అత్యవసర ప్రయాణంలో టికెట్లు దొరక్కపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు. దాంతో రిజర్వేషన్ లేకుండా జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారు ఆ క్షణానికి కనబడిన బోగీని ఎక్కి ఇబ్బందులుపడుతుంటారు. చాలామంది టీటీఈ చుట్టూ సీటు […]

Indian Railway | రైలు ప్రయాణం చేస్తుంటారా..? ఎమర్జెన్సీ ప్రయాణంలో ఖాళీ బెర్తుల సమాచారం ఇలా తెలుసుకోండి..!

Indian Railway |

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. నిత్యం వేలాది రైళ్లలో కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. సౌకర్యవంతంగా ఉండడంతో పాటు తక్కువ చార్జీలు ఉండడంతో రైలు ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అయితే, చాలా మంది రిజర్వేషన్‌ చేసుకొని ప్రయాణిస్తుంటారు. అత్యవసర ప్రయాణంలో టికెట్లు దొరక్కపోవడంతో ఇబ్బందులు పడుతుంటారు.

దాంతో రిజర్వేషన్ లేకుండా జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారు ఆ క్షణానికి కనబడిన బోగీని ఎక్కి ఇబ్బందులుపడుతుంటారు. చాలామంది టీటీఈ చుట్టూ సీటు కోసం తిరుగుతుంటారు. అయితే, ఇకపై ప్రయాణంలో ఖాళీ బెర్త్, సీటు మీకు కావాలంటే టీటీఈ, టీసీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ఏ కోచ్‌లో బెర్త్ అందుబాటులో ఉందో మొబైల్ ద్వారానే సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ (IRCTC Connect) యాప్ సహాయంతో ప్రయాణికులు రైలులో ఖాళీగా ఉన్న బెర్తుల సమాచారం తెలుసుకోవచ్చు. ఇందు కోసం మొదట యాప్ ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత ట్రైన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆ తర్వాత చార్ట్ ఎంప్టీ ఐకాన్‌పై క్లిక్ చేస్తే రైలు పేరు, నంబర్, బోర్డింగ్ స్టేషన్, తేదీని ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత రైలులో బెర్త్ ఖాళీగా ఉంటే వివరాలు కనిపిస్తాయి. ఏ కోచ్, ఏ క్లాస్‌లో ఎన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో పూర్తి సమాచారం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ యాప్‌కి సైన్ ఇన్ కావాల్సిన అవసరం సైతం లేదు.