Indian Railway | రైలులో ప్రయాణిస్తుంటారా..? ఈ నిబంధన గురించి తెలుసుకోండి.. లేకుంటే చెల్లించక తప్పదు మూల్యం..!

Indian Railway | నిత్యం లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు టికెట్‌ ధరలు సామాన్యులకు సైతం అందరూ రైలునే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణం సమయంలో ఎక్కువ మంది లోయర్‌ బెర్తుల కోసం ప్రయత్నిస్తుంటారు. మరికొందరు అప్పర్‌ బెర్తులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, మిడిల్‌ బెర్తులపై ఎక్కువగా ఎవరికీ నచ్చదు. దీనికి చాలానే కారణాలతో పాటు పలు నిబంధనలు ఉంటాయి. రైలులో ఎక్కువగా లోయర్‌, మిడిల్‌, అప్పర్‌, సైడ్‌ లోయర్‌, సైడ్‌ అప్పర్‌ బెర్తులంటాయి. […]

Indian Railway | రైలులో ప్రయాణిస్తుంటారా..? ఈ నిబంధన గురించి తెలుసుకోండి.. లేకుంటే చెల్లించక తప్పదు మూల్యం..!

Indian Railway | నిత్యం లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు టికెట్‌ ధరలు సామాన్యులకు సైతం అందరూ రైలునే ఆశ్రయిస్తుంటారు. ప్రయాణం సమయంలో ఎక్కువ మంది లోయర్‌ బెర్తుల కోసం ప్రయత్నిస్తుంటారు.

మరికొందరు అప్పర్‌ బెర్తులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, మిడిల్‌ బెర్తులపై ఎక్కువగా ఎవరికీ నచ్చదు. దీనికి చాలానే కారణాలతో పాటు పలు నిబంధనలు ఉంటాయి. రైలులో ఎక్కువగా లోయర్‌, మిడిల్‌, అప్పర్‌, సైడ్‌ లోయర్‌, సైడ్‌ అప్పర్‌ బెర్తులంటాయి. వాస్తవానికి సాధారణ సమయంలో మిడిల్‌ బెర్తులు వచ్చిన వారు కూర్చోనూ లేరు.. పడుకోనూ లేరు.

రైల్వే నిబంధనల మేరకు మిడిల్‌ బెర్తు ప్రయాణికుడు తప్పనిసరిగా రాత్రి 10 గంటలకు ముందు.. ఉదయం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు. ఆయా సమయాల మధ్య మాత్రమే మిడిల్‌ బెర్తులో పడుకునేందుకు అవకాశం ఉండదు. ఎంత దూరం ప్రయాణించినా.. అలసిపోయి నిద్రపోవాలనుకున్నా రాత్రి 10 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చొని ఉండాల్సిందే. ఈ నిబంధనలు పాటించకపోతే రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. అయితే, చాలా సందర్భాల్లో మిడిల్‌ బెర్తుల విషయంలో గొడవలు జరిగిన ఘటనలూ లేకపోలేదు.

ఈ క్రమంలో రైల్వే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలంటూ సూచిస్తూ ఉంటుంది. ఇక టికెట్ల తనిఖీ విషయానికి వస్తే టీటీఈ పగటి పూట మాత్రమే టికెట్‌ను తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి 10 గంటల తర్వాత ఎవరినీ డిస్టర్బ్‌ చేయరు.

ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల్లోపు మాత్రమే తనిఖీ చేస్తారు. ఈ నిబంధనలు పాటించకపోతే టీటీఈపై చర్యలు తీసుకునేందుకు అవకాశాలుంటాయి. అయితే, ఈ నిబంధన కేవలం పగటిపూట బయలుదేరే వాటికి మాత్రమే వర్తిస్తుంది. రాత్రి బయలుదేరే రైళ్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదని రైల్వేశాఖ స్పష్టం చేసింది.