T20: భారత్‌ టార్గెట్‌ 187., ప్రస్తుతం 143/3

విధాత: ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భార‌త్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. భార‌త్ ముందు 187 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ కామెరూన్‌ (52), టిమ్‌ డేవిడ్‌ (54) ఇద్దరూ హాప్ సెంచ‌రీల‌తో మెరిశారు. ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28 నాటౌట్‌) కూడా రాణించారు. భారత బౌలర్లలో […]

  • By: krs    latest    Sep 25, 2022 3:33 PM IST
T20: భారత్‌ టార్గెట్‌ 187., ప్రస్తుతం 143/3

విధాత: ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భార‌త్ టాస్ గెలిచి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. భార‌త్ ముందు 187 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యాన్ని ఉంచింది.

బ్యాటింగ్‌లో ఓపెనర్ కామెరూన్‌ (52), టిమ్‌ డేవిడ్‌ (54) ఇద్దరూ హాప్ సెంచ‌రీల‌తో మెరిశారు. ఇంగ్లిస్‌ (24), డేనియల్‌ సామ్స్‌(28 నాటౌట్‌) కూడా రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు తీయగా.. భువీ, చాహల్‌, హర్షల్ చెరో వికెట్‌ తీశారు.

మొద‌టి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలువ‌గా, రెండో మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించింది. సిరీస్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించే ఈ మూడో మ్యాచ్‌లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో మ‌రికొద్ది సేప‌ట్లో తేల‌నున్న‌ది.

అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం భారత్‌ 15 ఓవర్లలో 143/3 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే 30 బాల్స్ లో 44 రన్స్ కొట్టాల్సి ఉంది. హర్దిక్‌ పాండ్యా1, విరాట్‌ కోహ్లి 48 పరుగులతో క్రీజులో ఉన్నారు.