మురుగునీటి శుద్ధి కేంద్రాన్నిప‌రిశీలించిన మంత్రి కేటీఆర్‌

విధాత: హైదరాబాద్‌, ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని(ఎస్టీపీ) మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై ఆరా తీశారు. అనంతరం ఎస్టీపీ వద్ద పని చేస్తున్న కార్మికులతో మాట్లాడిన మంత్రి వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగునీటి శుద్ధి ల‌క్ష్యంగా జ‌ల‌మండ‌లి చేప‌ట్టిన 31 ఎస్టీపీ నిర్మాణం చేస్తున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎంఎల్‌టీ మురుగు నీరు శుద్ధి చేయాల‌నే లక్ష్యంతో […]

  • By: krs    latest    Sep 24, 2022 9:05 AM IST
మురుగునీటి శుద్ధి కేంద్రాన్నిప‌రిశీలించిన మంత్రి కేటీఆర్‌

విధాత: హైదరాబాద్‌, ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని(ఎస్టీపీ) మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై ఆరా తీశారు. అనంతరం ఎస్టీపీ వద్ద పని చేస్తున్న కార్మికులతో మాట్లాడిన మంత్రి వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

హైద‌రాబాద్‌లో వంద శాతం మురుగునీటి శుద్ధి ల‌క్ష్యంగా జ‌ల‌మండ‌లి చేప‌ట్టిన 31 ఎస్టీపీ నిర్మాణం చేస్తున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎంఎల్‌టీ మురుగు నీరు శుద్ధి చేయాల‌నే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాల‌ను జ‌ల‌మండ‌లి నిర్వ‌హిస్తున్న‌ది. 2036 వ‌ర‌కు ఇబ్బంది లేకుండా ఎస్టీపీల‌ను నిర్మిస్తున్నారు.

అనంతరం హైద‌రాబాద్‌లో జ‌ల‌మండ‌లి ప‌నిచేసే ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించేందుకుగాను రూపొందించిన సేఫ్టీ ప్రొటోకాల్ వాహ‌నాల‌ను నాన‌క్‌రామ్ గూడలో మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ప‌ని ప్ర‌దేశాల్లో భ‌ద్ర‌త‌-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త అనే నినాదంతో ప‌నిని ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

పైప్‌లైన్ విస్త‌ర‌ణ‌, సీవ‌రేజ్ ప‌నులు, లీకేజీల నివార‌ణ ప‌నులు, మ్యాన్‌హోల్ మ‌ర‌మ్మ‌తులు ఇలా ప్ర‌తి ప‌ని ప్ర‌దేశంలో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు క‌చ్చితంగా పాటించేలా కొత్త వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫ‌తేన‌గ‌ర్‌లో జ‌ల‌మండ‌లి నిర్మిస్తున్న ఎస్టీపీ ప‌నుల‌ను మంత్రి కేటీఆర్ ప‌రిశీలించారు.