Ganga Ramayan Yatra | గంగా రామాయణ్‌ యాత్ర ఎయిర్‌ ప్యాకేజీని ప్రకటించిన IRCTC.. హైదరాబాద్‌ నుంచే..!

IRCTC | Ganga Ramayan Yatra | పర్యాటకుల కోసం IRCTC బంపర్‌ ఆఫర్‌ తీసుకువచ్చింది. వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటన కొనసాగనున్నది. ప్యాకేజీ టూర్‌ ఈ నెల 7న ప్రారంభంకానున్నది. ప్యాకేజీలో అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌, సార్‌నాథ్‌, వారణాసితో పాటు పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే వీలున్నది. అయితే, ప్రయాణమంతా విమానంలో సాగనున్నది. యాత్ర సాగేదిలా.. […]

Ganga Ramayan Yatra | గంగా రామాయణ్‌ యాత్ర ఎయిర్‌ ప్యాకేజీని ప్రకటించిన IRCTC.. హైదరాబాద్‌ నుంచే..!

IRCTC |

Ganga Ramayan Yatra | పర్యాటకుల కోసం IRCTC బంపర్‌ ఆఫర్‌ తీసుకువచ్చింది. వేసవి సెలవుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటన కొనసాగనున్నది. ప్యాకేజీ టూర్‌ ఈ నెల 7న ప్రారంభంకానున్నది. ప్యాకేజీలో అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌, సార్‌నాథ్‌, వారణాసితో పాటు పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే వీలున్నది. అయితే, ప్రయాణమంతా విమానంలో సాగనున్నది.

యాత్ర సాగేదిలా..

Day-1 : యాత్ర తొలిరోజు జూన్‌ 7న ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని విమానాశ్రయం నుంచి ఉదయం 9.30 గంటలకు విమానం బయలుదేరి 11.25 గంటలకు వారణాసి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్‌ చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

భోజనం చేసుకున్న తర్వాత కాశీ దేవాలయం, గంగా ఘాట్‌లను సందర్శిస్తారు. రాత్రి వారణాసిలోనే బస చేయాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికులు సొంత ఖర్చులతో ఆలయానికి, ఘాట్ల వద్దకు ఆటోల్లో వెళ్లాల్సి ఉంటుంది.

Da-2 : రెండోరోజు ఉదయం సార్‌నాథ్‌ బయలుదేరి వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం వరకు వారణాసికి చేరుకుంటారు. బిర్లా ఆలయం సందర్శన ఉంటుంది. అనంత‌రం ఆ తర్వాత ఖాళీ సమయంలో షాపింగ్‌ చేసుకోవచ్చు. లేదంటే మళ్లీ దర్శనాలకు వెళ్లవచ్చు. రాత్రి భోజనం చేసుకొని వారణాసిలోనే బస చేయాల్సి ఉంటుంది.

Day-3 : మూడో రోజు హోటల్ నుంచి చెకౌట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆనంద్‌ భవన్‌, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శనకు వెళ్తారు. సాయంత్రం అయోధ్యకు బయలుదేరి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెకిన్‌ అయ్యాక భోజనం చేసి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

Day-4 : నాలుగో రోజు అయోధ్య ఆలయాన్ని సందర్శన. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. లక్నోలో రాత్రి బస ఉంటుంది.

Day-5 : ఐదో రోజు నైమిశరణ్యాన్ని సందర్శిస్తారు. సాయంత్రం లక్నోకు బయలుదేరుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day-6 : ఆరో రోజు బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తిరిగి సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు. దాంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఇలా..

గంగా రామయణ్‌ యాత్ర ప్యాకేజీలో కంఫర్ట్ కేటగిరిలో ఒక్కొక్కరు రూ.36,850 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ షేరింగ్‌లో రూ.29,900వేలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరు రూ.28,200 చెల్లిస్తే సరిపోతుంది.

అలాగే 5-11 సంవత్సరాల వయస్సున వారికి సైతం టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. విమాన టికెట్‌ చార్జీలు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్నీ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి.