Pawan Kalyan | బేరం తెగినట్లేనా.. చంద్రబాబుతో పవన్ భేటీ!

Pawan Kalyan విధాత‌: ఎన్నాళ్ళని ఇలా తేల్చకుండా ఉంటాం.. ఎన్నికలు ఇంకా ఏడాదే ఉన్నాయ్. ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాం అనుకున్నారో ఏమో.. టిడిపి అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్(Pawan Kalyan) కాసేపటి క్రితం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. గత వారం రోజులుగా చంద్రబాబు విజయవాడ చుట్టుపక్కల పర్యటించారు. సడెన్ గా బాబు హైదరాబాద్ చేరుతూనే పవన్ను పిలిపించుకుని చర్చలకు దిగారు. పవన్ ఇంకా పాలిటిక్స్ లో సీరియస్ గా వెళ్ళడం లేదు. భారీ […]

Pawan Kalyan | బేరం తెగినట్లేనా.. చంద్రబాబుతో పవన్ భేటీ!

Pawan Kalyan

విధాత‌: ఎన్నాళ్ళని ఇలా తేల్చకుండా ఉంటాం.. ఎన్నికలు ఇంకా ఏడాదే ఉన్నాయ్. ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాం అనుకున్నారో ఏమో.. టిడిపి అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్(Pawan Kalyan) కాసేపటి క్రితం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. గత వారం రోజులుగా చంద్రబాబు విజయవాడ చుట్టుపక్కల పర్యటించారు.

సడెన్ గా బాబు హైదరాబాద్ చేరుతూనే పవన్ను పిలిపించుకుని చర్చలకు దిగారు. పవన్ ఇంకా పాలిటిక్స్ లో సీరియస్ గా వెళ్ళడం లేదు. భారీ వాహనం వారాహి అయితే సిద్ధం చేశారు. కానీ దాన్ని ఇంకా బయటకు తీయలేదు. ఆంధ్ర రోడ్ల మీదకు ఎప్పుడు తెస్తారో తెలియదు.

ముందుగా పొత్తుల సంగతి తేలితే తప్ప వారాహిని షెడ్ నుంచి బయటకు తెచ్చేలా లేరు. ఎవరికి ఎన్ని సీట్స్ అన్నది తేల్చుకుంటే తప్ప పవన్ పర్యటనలు.. ప్రచారాల లెక్క తేలదు. మరోవైపు పవన్ సింగిల్ గా వెళ్ళాలని కాపు సామాజికవర్గం ఆశిస్తున్నా ఆయన మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్రలో ఇప్పటికే కొన్ని టికెట్స్ ఖరారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

పవన్ ఇటీవల ఢిల్లీ వెళ్ళి బీజేపీ నాయకులను కలసి వచ్చారు. ఆ ఢిల్లీ కబుర్లు కూడా చంద్రబాబుతో మాట్లాడి ఉంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గమ్మున సీట్స్.. టికెట్స్ ఖరారు చేస్తే బావుంటుందని చంద్రబాబు.. పవన్ భావిస్తున్నట్లు ఉంది.

ఇదిలా ఉండగా ఈ మధ్యనే జనసేన క్యాడర్ కి బహిరంగ లేఖను రాసిన పవన్ అందులో పొత్తుల గురించి ప్రస్తావించారు. పొత్తుల విషయం మీద తానే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అని రాస్తూ ఎవరైనా తనమీద కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దని సూచించారు. ఇక నేటి భేటీలో పొత్తుల అంశం మీద చర్చ జరిగే ఉంటుందని అంటున్నారు.