Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌

విధాత‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు క్యాన్సర్‌ (Cancer) సోకింది. ఛాతి వద్ద క్యాన్సర్‌ కణజాలాన్నిగుర్తించారు. దీంతో చికిత్స చేసి దాన్ని తొలిగించినట్లు వైట్‌హౌజ్‌ (White House) వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. జో బైడెన్‌ ఒక ప్రెస్‌మీట్‌లో తనకు క్యాన్సర్‌ ఉన్నదని చెప్పారు. దాంతో వైట్‌హౌజ్‌ ఆ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో వైట్‌హౌజ్‌ […]

Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌

విధాత‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు క్యాన్సర్‌ (Cancer) సోకింది. ఛాతి వద్ద క్యాన్సర్‌ కణజాలాన్నిగుర్తించారు. దీంతో చికిత్స చేసి దాన్ని తొలిగించినట్లు వైట్‌హౌజ్‌ (White House) వైద్యులు తెలిపారు. క్యాన్సర్‌ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

జో బైడెన్‌ ఒక ప్రెస్‌మీట్‌లో తనకు క్యాన్సర్‌ ఉన్నదని చెప్పారు. దాంతో వైట్‌హౌజ్‌ ఆ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో వైట్‌హౌజ్‌ రంగంలోకి దిగి ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బైడన్ గత ఏడాది పదవీ బాధ్యతలు చేపట్టానికి ముందు ఆయనకు ఉన్న స్కిన్‌ క్యాన్సర్‌ గురించి ఆయన ప్రస్తావించినట్లు వైట్‌ హౌజ్‌ వెల్లడించింది.

ఏడాది కాలంగా ఆయన క్యాన్సర్‌ సోకిందనే విషయంపై జరుగుతున్న చర్చకు వైట్‌హౌజ్‌ వైద్యులు అసలు విషయాన్ని వెల్లడించారు. బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్‌ సోకిందని, దాన్ని చికిత్స చేసి తొలిగించామని తెలిపారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్టు అధికారికంగా తెలిపారు.