డిసెంబర్ 7నుంచి కేఏ పాల్ జిల్లాల పర్యటన

విధాత: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ డిసెంబర్ 7 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచేందుకు జిల్లాల పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 7న మెదక్ జిల్లాలో, 8న నిజామాబాద్, 9న అదిలాబాద్, 10న కరీంనగర్, 11న వరంగల్, 12న ఖమ్మం, 13న నల్గొండ, 14న మహబూబ్ […]

  • By: krs    latest    Nov 20, 2022 7:49 AM IST
డిసెంబర్ 7నుంచి కేఏ పాల్ జిల్లాల పర్యటన

విధాత: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ డిసెంబర్ 7 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేయనున్నట్టు ప్రకటించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనకు, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచేందుకు జిల్లాల పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబర్ 7న మెదక్ జిల్లాలో, 8న నిజామాబాద్, 9న అదిలాబాద్, 10న కరీంనగర్, 11న వరంగల్, 12న ఖమ్మం, 13న నల్గొండ, 14న మహబూబ్ నగర్, 15న రంగారెడ్డి, 16న హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో బీజేపీ , రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్పులపాలు చేస్తున్న పాలనా విధానాలను, సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను ప్రజలకు అర్థమయ్యేలా వివరించనున్నట్టు తెలిపారు. ప్రజలను మేల్కొలిపి ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరనున్నట్టు చెప్పారు.

బీజేపీని, ఆ పార్టీ కి బి పార్టీలుగా పనిచేస్తున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ లను ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు. వారికి ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజాశాంతి పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడానికే జిల్లాల పర్యటన చేపడుతున్నానన్నారు.