పేదింటి ఆడపడుచులకు ‘కల్యాణ లక్ష్మీ’ వరం: MLA పద్మ
రూ.47,05,452ల చెక్కుల పంపిణీ విధాత, మెదక్ బ్యూరో: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని మెదక్ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణం, మెదక్ హవేళి ఘనపూర్ మండలాలకు సంబంధించిన 47 మంది రూ.47,05,452 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల్నికన్నతల్లి దండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ […]

- రూ.47,05,452ల చెక్కుల పంపిణీ
విధాత, మెదక్ బ్యూరో: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం ఒక వరమని మెదక్ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణం, మెదక్ హవేళి ఘనపూర్ మండలాలకు సంబంధించిన 47 మంది రూ.47,05,452 విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల్నికన్నతల్లి దండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మండల రైతు బంధు అద్యక్షులు కిష్టయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్లు సయ్యద్ ఉమర్, పాలిన్ రత్న కిరణ్, మెదక్ హవేళిఘనాపూర్ ఎమ్మార్వోలు శ్రీనివాస్, నవీన్ కుమార్, హవేళిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కృష్ణ గౌడ్, శ్రీధర్ యాదవ్, ప్రవీణ్ గౌడ్, బొద్దుల.కృష్ణ, సాదిక్ అలీ, వెంకటేశం, ఆంజనేయులు, యాదగిరి, సాంబశివ రావు, సర్పంచులు చెన్నా గౌడ్, యామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.