ఎన్టీఆర్ ఫ్యామిలీలో కదలిక. కల్యాణ్ రామ్ కూడా!

విధాత: నందమూరి తారక రామారావు ఫ్యామిలీ ఇదివరకటిలా లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో బీభత్సమైన మార్పు కనిపిస్తుంది. ఆ పెద్దాయన గురించి ఎవరైనా ఏదైనా అంటే.. ఇప్పుడు ఫ్యామిలీలోని మెంబర్స్ అందరూ రియాక్ట్ అవుతున్నారు. అంతకు ముందు చంద్రబాబు భార్యని వైసీపీ వాళ్లు అవమానించిన సమయంలో కూడా ఫ్యామిలీ అంతా ఓ చోట కూర్చుని మీడియా సమావేశం నిర్వహించి.. వైసీపీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మళ్లీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైఎస్ఆర్ […]

  • By: krs    latest    Sep 22, 2022 2:29 PM IST
ఎన్టీఆర్ ఫ్యామిలీలో కదలిక. కల్యాణ్ రామ్ కూడా!

విధాత: నందమూరి తారక రామారావు ఫ్యామిలీ ఇదివరకటిలా లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో బీభత్సమైన మార్పు కనిపిస్తుంది. ఆ పెద్దాయన గురించి ఎవరైనా ఏదైనా అంటే.. ఇప్పుడు ఫ్యామిలీలోని మెంబర్స్ అందరూ రియాక్ట్ అవుతున్నారు. అంతకు ముందు చంద్రబాబు భార్యని వైసీపీ వాళ్లు అవమానించిన సమయంలో కూడా ఫ్యామిలీ అంతా ఓ చోట కూర్చుని మీడియా సమావేశం నిర్వహించి.. వైసీపీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పుడు మళ్లీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైఎస్ఆర్ పేరు పెట్టడంతో మరోసారి ఆ ఫ్యామిలీ అంతా.. వైసీపీ ప్రభుత్వ చర్యను ఖండిస్తోంది. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును జగన్ సర్కార్ తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

రాజకీయ లబ్ధి కోసం.. ఎంతోమంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న యూనివర్శిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంశాన్ని వాడుకోవడం తప్పుగా ఆయన ఈ ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. కల్యాణ్ రామ్ ఈ ట్వీట్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ‘కర్ర విరగకూడదు.. పాము చావకూడదు’ అనే చందంగా ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.

‘‘1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్‌గారు ఈ మహావిద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు’’ అని కల్యాణ్ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరి కంటే ముందు నందమూరి రామకృష్ణ, బాలకృష్ణలు కూడా ఈ అంశంపై స్పందించి.. వైసీపీ నాయకుల చర్యను తప్పుపట్టారు.