Karimnagar: మున్సిపల్ మంత్రి KTR ఇలాకాలో.. కార్మికుల సమ్మె బాట
స్పందించి సమస్యలు పరిష్కరిస్తామన్న కమిషనర్ కమిషనర్ హామీతో విధులకు హాజరైన కార్మికులు విధాత బ్యూరో, కరీంనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు శనివారం విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. మే నెల నుండి వేతనాలతో పాటుగా పిఆర్సి బకాయిలను ఒక్కోనెల జత చేసి అందిస్తామని, అదేవిధంగా పిఎఫ్ పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న […]

- స్పందించి సమస్యలు పరిష్కరిస్తామన్న కమిషనర్
- కమిషనర్ హామీతో విధులకు హాజరైన కార్మికులు
విధాత బ్యూరో, కరీంనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు శనివారం విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. మే నెల నుండి వేతనాలతో పాటుగా పిఆర్సి బకాయిలను ఒక్కోనెల జత చేసి అందిస్తామని, అదేవిధంగా పిఎఫ్ పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించి విధులకు హాజరయ్యారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడం చర్చనీయాంశం అయింది. మున్సిపల్ అభివృద్ధికి , అవార్డులు రావడానికి కష్టపడి పనిచేస్తున్న తాము కారణమైతే,తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని వారు ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ప్రత్యేక గ్రాంట్స్ విడుదల చేసి కార్మికుల పెండింగ్ పి ఆర్ సి, ఏరియర్స్ బకాయిలను అందించి పిఎఫ్ పెండింగ్ బకాయిలు ఇతర సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సమ్మెకు నాయకత్వం వహించిన సిఐటియు డిమాండ్ చేసింది.
మున్సిపల్ కార్మికుల సమస్యలు
ప్రభుత్వం పెంచిన 11వ పీఆర్సి ప్రకారం 2021 జూన్ నుంచి 2022 జనవరి వరకు 8 నెలల పెరిగిన పిఆర్సి ఏరియర్స్ బకాయిలు రావాల్సి ఉందని సిఐటియు నాయకులు తెలిపారు. 2009 నుంచి 2012 వరకు మూడు సంవత్సరాల పీఎఫ్ డబ్బులు కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ కావాల్సి ఉందన్నారు.
విలీన గ్రామాలలో పనిచేస్తున్న కార్మికులతో పాటు మరో 33 మంది కార్మికులకు 3 సంవత్సరాలు పీఎఫ్ డబ్బులు మున్సిపల్ నుండి రావాల్సి ఉందన్నారు. 14 మంది డ్రైవర్లకు సంబంధించి ఒక నెల వేతనాలు పెండింగ్ లో ఉన్నయన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ పథకం ఇంకా ప్రారంభించ లేదన్నారు.