Karnataka Elections | రసవత్తరంగా కన్నడ పోరు.. సిద్ధరామయ్య వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయాలు..!

Karnataka Elections | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka Elections) జోరుగా సాగుతోంది. పార్టీలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అయితే. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్‌, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్‌ నేత సిద్ధారామయ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన నేత ముఖ్యమంత్రి అవ్వాలా? వద్దా ? అని ప్రశ్నించారు. ఇప్పటికే లింగాయత్‌ ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ, ‘ఆయన […]

Karnataka Elections | రసవత్తరంగా కన్నడ పోరు.. సిద్ధరామయ్య వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయాలు..!

Karnataka Elections |

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Karnataka Elections) జోరుగా సాగుతోంది. పార్టీలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అయితే. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్‌, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్‌ నేత సిద్ధారామయ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన నేత ముఖ్యమంత్రి అవ్వాలా? వద్దా ? అని ప్రశ్నించారు. ఇప్పటికే లింగాయత్‌ ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ, ‘ఆయన అవినీతికి మూలాధారం’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను బీజేపీ ట్విట్టర్‌ హ్యాండ్‌లో షేర్‌ చేసింది. ‘సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి.. కమ్యూనిటీ అవినీతిమయమైందని చెప్పడం క్షమించరాని విషయం’ అని పేర్కొంది.

ఈ వ్యాఖ్యలు మొత్తం లింగాయత్‌ కమ్యూనిటీనే అవమానించేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ అవినీతిని నమ్ముకున్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అంటూ విమర్శించారు. వీరశైవ లింగాయత్‌లపై తనకు ఎంతో గౌరవం ఉందని, లింగాయత్‌లకు 50కిపైగా టికెట్లు ఇచ్చామన్నారు.

తన వ్యాఖ్యలపై బీజేపీ వక్రీకరిస్తుందని, వివాదం సృష్టించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరో వైపు ఓ వర్గాన్ని అవమానించడం ద్వారా సిద్ధరామయ్య రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపించింది. వీరశైవ-లింగాయత్‌ వర్గాలను విభజించేందుకు సిద్ధరామయ్య గతంలో ప్రయత్నించారని విమర్శించింది.