KCR కనిపించడం లేదు.. ఆచూకీ చెప్పండి! గజ్వేల్‌లో నిరసన, ధర్నా
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఖాళీగా ఉందని..నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని బీజేపీ నాయకులు వినూత్న రీతిన నిరసనకు దిగారు. వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, టూలెట్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అని రాసిన బోర్డులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్ తగిలించారు బీజేపీ నాయకులు.

KCR: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని.. ఆచూకీ చెప్పాలంటూ వాంటెడ్ ఎమ్మెల్యే అని ఏకంగా ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికే బోర్డు తగిలించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
గత కొంత కాలంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఖాళీగా ఉందని.. నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని, రావాలని బీజేపీ నాయకులు వినూత్న రీతిన నిరసనకు దిగారు. వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే, టూ లెట్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అని రాసిన బోర్డులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్ తగిలించి క్యాంపు ఆఫీస్ గేటు ముందు ధర్నా చేశారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ రావాలి.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకు దిగిన బీజేపీ నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు.