కేసీఆర్ అబద్ధాల కంపెనీ తయారు చేసుకున్నారు: మంత్రి ప్రహ్లాద్ జోషి
విధాత: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. గురువారం యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో బీజేపీ కోసం ప్రజల ఎదురుచూపు.. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేదని, ప్రస్తుతం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు […]

విధాత: తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. గురువారం యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణలో బీజేపీ కోసం ప్రజల ఎదురుచూపు..
అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేదని, ప్రస్తుతం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి శక్తిని ప్రసాదించాలని నర్సింహ స్వామిని కోరుకున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను భూస్థాపితం చేసి, ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్‌ను అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయం సాధిస్తాం
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దుష్ట సంహారానికై అవతరించాడు. అలాంటి లక్ష్మి నరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణలో అవినీతి, అబద్ధాల పాలన నిర్మూలనకు పోరాటం ప్రారంభించాం. ధర్మ పోరాటంలో విజయం సాధించి తీరుతామని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పాలన అవినీతనిమయం
కొవిడ్ తర్వాత ప్రపంచంలో అన్ని ముఖ్య దేశాలు ఆర్థికంగా వెనుకబడితే భారత్ మాత్రం ఆర్థికంగా ముందుకు పోతుందన్నారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన తాండవిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తుందని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఇకనైనా అబద్ధాలు మానాలి
కేంద్ర ప్రభుత్వం ఏ టెండర్ అయినా గ్లోబల్ టెండర్ ద్వారా పనులను కేటాయిస్తుంది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో పనులను కేటాయిస్తుందని గుర్తు చేశారు. హెచ్‌సీసీఎల్‌కు మూడు కోల్‌మైన్‌లు 2015లో కేటాయిస్తే.. రెండు మైన్‌లు కేంద్రానికే తిరిగి ఇచ్చేశారన్నారు.
కేసీఆర్ అబద్ధాలు చెప్పే కంపెనీ తయారు చేసుకున్నారు, అవినీతి, అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకొని దివాలా తీయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సీఎం కేసీఆర్ అబద్ధాల ప్రచారం మానుకోవాలి.. లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గరలో ఉందని జోస్యం చెప్పారు.