ఢిల్లీ: BRS కార్యాల‌యంలో రైతు సంఘాల నేత‌ల‌తో KCR స‌మావేశం

విధాత‌: ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల‌కు చెందిన రైతుల సంఘాల నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈనెల‌14వ తేదీన ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ప‌లు రైతు సంఘాల నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను సీఎం కేసీఆర్ త‌న చాంబ‌ర్‌లో క‌లిశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. […]

ఢిల్లీ: BRS కార్యాల‌యంలో రైతు సంఘాల నేత‌ల‌తో KCR స‌మావేశం

విధాత‌: ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల‌కు చెందిన రైతుల సంఘాల నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈనెల‌14వ తేదీన ఢిల్లీ 5 ఎస్పీ మార్గ్ లో ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల‌కు చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ప‌లు రైతు సంఘాల నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను సీఎం కేసీఆర్ త‌న చాంబ‌ర్‌లో క‌లిశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు.

అనంత‌రం కార్యాలయం మొదటి, రెండో అంతస్థుల్లో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హల్ ను, పలువురికి కేటాయించిన చాంబర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆత‌ర్వాత తనను కలిసేందుకు అక్కడికి చేరుకున్న బీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేశారు.

బీఆర్ ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ వెంట పార్ల‌మెంట‌రీ పార్టీ నేతలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎంపీలు, త‌దిత‌ర నేత‌లు ఉన్నారు.