చుక్క‌లెన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే.. తెలంగాణ‌లోనూ కేసీఆర్ ఒక్క‌డే: MLC క‌విత

విధాత‌: చుక్క‌లు ఎన్ని ఉన్నాచంద‌మామ ఒక్క‌డే అన్న‌ట్టు, ఎన్ని పార్టీలు వ‌చ్చినా, ఏమొచ్చినా తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేట‌టువంటి వ్య‌క్తి కేసీఆరే మాత్ర‌మే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్ప‌ష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యంలో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, గ‌ణేశ్ గుప్తాతో క‌లిసి క‌విత మీడియాతో మాట్లాడారు. రైతుల వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు జారీ చేయ‌డంపై క‌విత […]

చుక్క‌లెన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే.. తెలంగాణ‌లోనూ కేసీఆర్ ఒక్క‌డే: MLC క‌విత

విధాత‌: చుక్క‌లు ఎన్ని ఉన్నాచంద‌మామ ఒక్క‌డే అన్న‌ట్టు, ఎన్ని పార్టీలు వ‌చ్చినా, ఏమొచ్చినా తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో ఉండేట‌టువంటి వ్య‌క్తి కేసీఆరే మాత్ర‌మే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్ప‌ష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యంలో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, గ‌ణేశ్ గుప్తాతో క‌లిసి క‌విత మీడియాతో మాట్లాడారు.

రైతుల వ్యవసాయ కల్లాల నిర్మాణానికి ఖర్చయిన రూ.151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు జారీ చేయ‌డంపై క‌విత మండిప‌డ్డారు. ఆ డ‌బ్బుల‌ను తిరిగి చెల్లించాల‌ని కేంద్రం ఆదేశించడం అత్యంత దారుణం, హేయం, బాధాక‌రం అని అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం అని నిరూపించుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ప్ర‌తి జిల్లా కేంద్రంలో రైతు మ‌హాధ‌ర్నా జ‌ర‌గ‌బోతున్న‌ద‌ని తెలిపారు. రైతులంద‌రూ ఈ ధ‌ర్నాలో పాల్గొని బీజేపీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న హ‌క్కులు సాధించుకోవాలంటే ధ‌ర్నా పెద్ద ఎత్తున జ‌రగాలి. చుక్క‌లు ఎన్ని ఉన్నా చంద‌మామ ఒక్క‌డే అన్న‌ట్టు, ఎన్ని పార్టీలు వ‌చ్చినా, ఏమొచ్చినా తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో ఉండే వ్య‌క్తి కేసీఆరే మాత్ర‌మే అని పేర్కొన్నారు.

చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు. చంద్ర‌బాబును ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. భ‌విష్య‌త్‌లోనూ అదే జ‌ర‌గ‌బోతుంద‌న్నారు. ఆ పార్టీలు ప్ర‌జ‌ల‌ శ్రేయ‌స్సు కోరే పార్టీలు కావు. తెలంగాణ ప్ర‌జ‌లు స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారు అని క‌విత స్ప‌ష్టం చేశారు.