KCR On Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ కొందాం.. ఆంధ్రావాళ్ల మద్దతు కోసం KCR సరికొత్త ప్లాన్
KCR On Visakha Steel Plant | విధాత: భారత రాష్ట్ర సమితి పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు చూస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రము, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మరింత గట్టిగ ఫోకస్ చేయాలనీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ కాపు నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు పార్టీ ఏపీ […]

KCR On Visakha Steel Plant |
విధాత: భారత రాష్ట్ర సమితి పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇరుగు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు చూస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో సంగతి ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రము, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మరింత గట్టిగ ఫోకస్ చేయాలనీ పార్టీ నిర్ణయించింది.
ఈ మేరకు ప్రముఖ కాపు నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. రావెల కిషోర్ బాబు, మరికొందరు నాయకులను చేర్చుకుని ముందుకుపోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఏ కారణం.. ఎలాంటి వేదిక.. ఒక బలమైన అంశాన్ని పట్టుకుని కదా ఆంధ్రాలో వేళ్లూనుకోవాలి.. దానికి ఇప్పటికి ఓ అవకాశం దొరికింది.
కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని నిర్ణయించింది. దాన్ని అలాగే ఉంచండి, అని రాష్ట్రప్రభుత్వం పలుమార్లు కోరినా కేంద్రం వినడం లేదు. అమ్మేద్దాం.. ఎలా ఉన్నాసరే వదిలించు కుంటామని కేంద్రం చెబుతోంది. ఈమేరకు అంతర్జాతీయ బిడ్లు ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. అయితే సరిగ్గా ఈ అంశం కేసీఆర్‌కు అవకాశంగా దక్కిందని అంటున్నారు.
కేంద్రం అమ్మేయాలనుకుంటున్న విశాఖ ఉక్కుకు తాము సైతం బిడ్లు వేస్తామని, వేలంలో ఆ కంపెనీని దక్కించుకుంటామని కేసీఆర్ భావిస్తున్నారు. ఈమెరేకు ఈమధ్య కేటీఆర్ సైతం ఉక్కును అమ్మేయొద్దని, ప్రయివేటీకరణ చేయొద్దని కేంద్రాన్ని కోరారు. సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారు.
ఈమేరకు త్వరలో కొందరు అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి పరిశీలిస్తారని అంటున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రజల మద్దతు పొందేందుకు వీలు దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి ఆంధ్ర పాలిటిక్స్ లోనికి అడుగు పెట్టడానికి కేసీఆర్ కు ఒక అవకాశం దక్కిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాలేదని, జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో వేలకోట్లు పెట్టి స్టీల్ ప్లాంట్ ఎలా కొంటారని, ఇదంతా ఓ బూటకం అని విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయన లెక్కలు ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు.