తెలంగాణ.. ప్రత్యేక దేశం అనే విధంగా కేసీఆర్ తీరు: ఈటల
విధాత: రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానికానికి స్పూర్తి నింపే రోజు జనవరి 26వ తేదీ అని, అంతటి ప్రాముఖ్యం ఉన్న జనవరి 26ను తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు జరపకపోవడం సిగ్గుచేటు అని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచ దేశాలు గౌరవిస్తుండగా, తెలంగాణలో ఇందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించడం దారుణం అన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ […]

విధాత: రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానికానికి స్పూర్తి నింపే రోజు జనవరి 26వ తేదీ అని, అంతటి ప్రాముఖ్యం ఉన్న జనవరి 26ను తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు జరపకపోవడం సిగ్గుచేటు అని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచ దేశాలు గౌరవిస్తుండగా, తెలంగాణలో ఇందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించడం దారుణం అన్నారు.
ఇవాళ న్యూఢిల్లీలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరమని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా సమాజం తలదించుకుందన్నారు. తెలంగాణ ప్రత్యేక దేశం అనే విధంగా, భారత్‌తో సంబంధం లేదనే విధంగా కేసీఆర్ తీరు ఉందని, గవర్నర్ ను అవమానపర్చడం అంటే రాజ్యాంగాన్ని తద్వారా తెలంగాణ మహిళలను అవమాన పర్చడమేనన్నారు.
కేసీఆర్‌కు మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర ఏర్పడిన తరువాత అప్పటి గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్‌ను అనేక సార్లు కలిశారని, మొకరిల్లి నమస్కారాలు చేసేవారని, పొర్లు దండాలు పెట్టే వారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించిన ఆయనతో చర్చించి, ఆశీర్వాదం తీసుకుని చేపట్టేవారన్నారు.
కాని బలహీనవర్గానికి చెందిన తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన తరువాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. తరచూ అవమానాలకు గురి చేస్తూ ఫ్యూడల్ మనస్తత్వాన్ని వీడడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తరువాత మొదటి టర్మ్‌లో మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించారన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో ఒక ఎస్సి, బీసీ మహిళా మంత్రి లేకుండా చేశారని అన్నారు.
హైదరాబాద్ సరూర్ నగర్‌లోని అనాథ పాఠశాలలో నాలుగువందల మంది బాలికలకు ఒకే ఒక టాయ్‌లెట్ ఉందన్నారు. మహిళలు, బాలికల పట్ల చులకన భావం ఏ స్థాయిలో ఉందో ఇది నిదర్శనమన్నారు. కెసిఆర్ స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో డబుల్ బెడ్‌రూమ్ రాలేదని రమేష్ అనే వ్యక్తి ఉరేసుకున్నాడు. గిరిజన, హరిజన కాలనీల్లో మీటర్లు లేవని కరెంట్ కనెమన్లు కట్ చేస్తున్నారని, ధరణి ఫోర్టల్ కారణంగా రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగలేక పోతున్నారన్నారు.
రాష్ట్రంలో ప్రతి పార్టీలో కోవర్టులు, ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష పార్టీల మనుగడ లేకుండా చేశారని రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలను ఎందుకు మింగుతున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారు.
కేసీఆర్ వెళ్లగొడితే అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ, నేను మీలా పార్టీలు మారే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. నేను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ప్రజలందరికీ తెలుసు అని, ఎవరి సానుభూతి అక్కర్లేదని, ప్రజల మద్ధతు ఉందని రాజేందర్ తెలిపారు.