కోమటిరెడ్డి హంగ్ వ్యాఖ్యలపై టీ. కాంగ్రెస్‌లో దుమారం..! BJP, కాంగ్రెస్ నేతల స్పందన ఇదే
విధాత: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఏ పార్టీకి 60 సీట్లు రాని కారణంగా సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలవక తప్పదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కళను వంచించిన పార్టీలతో జతకట్టదు. కాంగ్రెస్ తోనే.. తెలంగాణ అస్ధిత్వం.. తెలంగాణ స్థిరత్వం..@INCTelangana @revanth_anumula @Manikrao_INC pic.twitter.com/hVqCRDoQdT — Congress […]

విధాత: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఏ పార్టీకి 60 సీట్లు రాని కారణంగా సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలవక తప్పదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి.
స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కళను వంచించిన పార్టీలతో జతకట్టదు.
కాంగ్రెస్ తోనే..
తెలంగాణ అస్ధిత్వం..
తెలంగాణ స్థిరత్వం..@INCTelangana @revanth_anumula @Manikrao_INC pic.twitter.com/hVqCRDoQdT— Congress for Telangana (@Congress4TS) February 14, 2023
వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా బీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని, ఈ విషయాన్ని ఇప్పటికే వరంగల్ సభలో రాహుల్ స్పష్టం చేశారన్నారు. వెంకట్ రెడ్డి పొత్తుల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కావచ్చు అన్నారు. అలాంటి మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.
మరో సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సెక్యులర్ పార్టీలు కలవాలని కోమటిరెడ్డి ఉద్దేశం కావచ్చు అన్నారు. ఆ కోణంలోనే వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పందిస్తూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తాయన్నారు.
కాంగ్రెస్‌తో BRS కలవక తప్పదు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అద్దంకి దయాకర్ ప్రతిస్పందిస్తూ.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తాయని, ఆయనపై గతంలోనే క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ రకంగా మాట్లాడే ఉండేవారు కాదన్నారు.
ఈ రకంగా పార్టీ నేతలు మాట్లాడకుండా పార్టీ అధిష్టానం కట్టుదిట్టం చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిస్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని, ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేతగా వెంకట్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని, ఆయన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదన్నారు.
ఎంపీ @KomatireddyKVR పొత్తులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కార్యకర్తలు #HaathSeHaathJodo యాత్రలో ఎంతో శ్రమించి పని చేస్తూ పార్టీ ని బలోపేతం చేస్తున్న తరుణంలో ఇలాంటి మాటలు కార్యకర్తలను గందరగోళం లో పడేస్తాయి.@Manikrao_INC @revanth_anumula pic.twitter.com/tQUXw33fxY
— Balram Naik Porika (@porika_balram) February 14, 2023
మరవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తులపై చేసిన సంచలన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే రాష్ట్ర పార్టీ నాయకులను ఫోన్లో సంప్రదించి ఆరా తీశారు. ఆయన ఈ సాయంత్రం హైదరాబాద్ వచ్చి దీనిపై స్పందించే అవకాశం ఉందన్నారు.
హంగ్ వస్తుందని నేను అనలేదు.. రాహుల్ గాంధీ చెప్పిందే.. నేను చెప్పా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తెలంగాణకు నష్టం చేసిన సీఎం కేసీఆర్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని, పొత్తులపై మాట్లాడితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఉండడంతో ఆయనపై పార్టీ అధిష్టానం ఏ రకమైన చర్యలు చేపడుతుందోనన్నది ఆసక్తి కరంగా మారింది.
తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తాయి – కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. pic.twitter.com/suwDB0ofD8
— Nellutla Kavitha (@iamKavithaRao) February 14, 2023
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ కలిసిన తర్వాత కాంగ్రెస్ , బీఆర్ఎస్ పొత్తులపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యం పరిశీలిస్తే ఆ రెండు పార్టీలు ఒకటేనన్న బీజేపీ వాదనకు బలం చేకూర్చే రీతిలో, ఆ పార్టీకి ప్రయోజనం కలిగించే లోపాయ కారి ఉద్దేశంతోనే వెంకటరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రేవంత్ వర్గీయులు అనుమానిస్తున్నారు.
మరోవైపు వెంకటరెడ్డి వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గణేష్ బిగాలలు మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి రాజకీయంగా కన్ఫ్యూజన్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు. తమకు ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో తిరిగి సంపూర్ణ మెజారితో అధికారంలోకి రాబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో లేదని వెంక రెడ్డి మాటలు చెబుతున్నాయి అన్నారు. అందుకే హంగు అంటూ పొత్తులంటు పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. వెంకటరెడ్డి వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆ రెండు పార్టీలు ఒకటేనన్న తమ వాదనకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో దండుపాళ్యం బ్యాచ్ లాంటివి అన్నారు. ఎన్నికల్లో పరస్పరం కొట్లాడుకున్నట్టుగా డ్రామాలు వేసి అధికారం కోసం ఒకటి అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పోత్తు పెట్టుకోమని ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదన్నారు.
కాంగ్రెస్ నాయకుడే హంగు, పొత్తులు అంటుండటం చూస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించిన వారు బీఆర్ఎస్‌లోకి పోతారని మరోసారి స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన సైతం ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలన్నట్లుగా ఉందని, లేకపోతే ఆ పార్టీ తరపున గెలిచే వాళ్ళని కాపాడుకోవడం కష్టమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుండవచ్చు అన్నారు. మొత్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పోటీ చేస్తారని, తాము మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామన్నారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలన బాగుందని పొగిడిన తీరు, తాజాగా వెంకటరెడ్డి వ్యాఖ్యలుల విశ్లేషిస్తే ఆ రెండు పార్టీలు ఎన్నికల నాటికి ఒకటి అవుతాయని స్పష్టమవుతుందన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదని వారి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్న
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందిస్తూ.. కోమటి రెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏమి మాట్లాడుతారో వారు ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. కాంగ్రెస్ లో ఉండి బీజేపీని గెల్పించమని, బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ ని గెల్పించమని అనే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
MP కోమటిరెడ్డి అర్జునుడా? శల్యుడా? గడ్కరీని కలిసిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు!