Komatireddy | ఏది నిజం.. ఎందుకీ మౌనం ! రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికేనా..? 

Komatireddy | వేముల వీరేశం, శశిధర్ రెడ్డిల చేరికలపై ఉత్తమ్, వెంకట్ రెడ్డిల అభ్యంతరాలు.. రంగంలోకి రేవంత్ రెడ్డి విధాత: ఒకప్పటి కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ముమ్ముర ప్రచారం సాగుతుంది. పొంగులేటి, జూపల్లిల వెంట రేపు ఢిల్లీకి వెళ్లి రాజగోపాల్ రెడ్డి కూడా వారితో పాటు కాంగ్రెస్‌లో చేరికలపై ప్రకటన చేయనున్నట్లు అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు బిజేపి వర్గాల్లోనూ […]

Komatireddy | ఏది నిజం.. ఎందుకీ మౌనం ! రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంతగూటికేనా..? 

Komatireddy |

  • వేముల వీరేశం, శశిధర్ రెడ్డిల చేరికలపై ఉత్తమ్, వెంకట్ రెడ్డిల అభ్యంతరాలు..
  • రంగంలోకి రేవంత్ రెడ్డి

విధాత: ఒకప్పటి కాంగ్రెస్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ముమ్ముర ప్రచారం సాగుతుంది. పొంగులేటి, జూపల్లిల వెంట రేపు ఢిల్లీకి వెళ్లి రాజగోపాల్ రెడ్డి కూడా వారితో పాటు కాంగ్రెస్‌లో చేరికలపై ప్రకటన చేయనున్నట్లు అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు బిజేపి వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తుంది.

కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి తిరిగి చేరేందుకు వీలుగా ఆయన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం వద్ద ఇప్పటికే చర్చలు పూర్తి చేశారని కోమటిరెడ్డి వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

రాహుల్ గాంధీ గురువారం అమెరికా నుంచి రాగానే ఆయనతో రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి జూపల్లిలలు ఆయనతో భేటీ అయి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టతనిస్తారని తెలుస్తుంది. కాంగ్రెస్ లో చేరికలపై ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి బుధవారం పొంగులేటి, జూపల్లిలతో చర్చలు సాగించడం గమనార్హం.

congress
congress

మరోవైపు బిజెపి నుండి మళ్లి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తనపై విస్తృత ప్రచారం సాగుతున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండించకుండా మౌనం వహించడం చూస్తే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారడానికి నిదర్శనమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో బిజెపిలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను పార్టీని వీడవద్దంటూ ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలుస్తుంది.

ఈటెల రాజేందర్ తాను పార్టీలు మారే వ్యక్తిని కాదంటూ ఇప్పటికే స్పష్టతనివ్వగా, రాజగోపాల్ రెడ్డి మాత్రం తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఇంతవరకు నేరుగా ఖండించలేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు తధ్యమని, మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని నల్గొండ కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గత చర్చలు జోరందుకున్నాయి.

కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పొంగులేటి వెంట నకిరేకల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జి చకిలం అనిల్ కుమార్, కోదాడ మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి సహా పలు నియోజకవర్గాల బిఆర్ఎస్ అసమ్మతి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చని ప్రచారం వినిపిస్తుంది.

అయితే ఉమ్మడి నల్లగొండకు చెందిన కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ జిల్లాకు చెందిన వేముల వీరేశం, శశిధర్ రెడ్డిల చేరిక పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయగా రేవంత్ రెడ్డి వారితో చర్చించి చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు. శశిధర్ రెడ్డి తాను పార్టీ మారడం లేదంటూ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో పొంగులేటి, జూపల్లి సహా కాంగ్రెస్ లో ఎవరెవరు చేరుతారు అన్నది తేటతెల్లం కానుంది.